భారీ ఉగ్రకుట్రను చేధించారు.. వారి అరెస్టుతో పెద్ద గండమే తప్పింది
భారీ ముప్పు తప్పింది. నిఘా వర్గాలు నిలువరించటంతో వందలాది మంది ప్రాణాలు నిలిచాయి. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న భారీ ఉగ్రకుట్రకు చెక్ చెప్పటంతో జాతీయ దర్యాప్తు సంస్థ మెరుపువేగంతో స్పందించటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. అమాయకుల ప్రాణాల్ని తీసేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్న తొమ్మిది మంది ఉగ్రవాదుల్ని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను జాతీయ దర్యాప్తు సంస్థ విడుదల చేసింది.
దాయాది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో అల్లకల్లోలాన్ని క్రియేట్ చేసేందుకు భారీ ఎత్తున ప్లాన్ చేశారు. నిధులు సమీకరించటంతో పాటు.. ఆటోమేటిక్ రైఫిల్స్.. తుపాకులు.. పేలుడు సామాగ్రితో పాటు ఆయుధాల సేకరణ చివరి దశలో ఉంది. వీరి ఉగ్రకుట్రను గుర్తించిన జాతీయ దర్యాప్తు సంస్థ వారిని అదుపులోకి తీసుకుంది.
కుట్రకు తెర తీసిన వారంతా కేరళ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పట్టుబడటం గమనార్హం. కేరళలోని ఏర్నాకుళంలో ముర్షీద్ హసన్.. బిశ్వాస్.. హొసేన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ లోని ముసీరాబాద్ లో షకీబ్.. అబు.. మైనుల్.. లియూ.. అల్ మామున్.. అతీతుర్ లు పట్టుబడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కేరళలో దొరికిన ముగ్గురు సైతం పశ్చిమబెంగాల్ కు చెందిన వారే కావటం.
అదుపులోకి తీసుకున్న ఉగ్రవాదుల వద్ద డిజిటల్ పత్రాలు.. జిహాదీ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఆపరేషన్ లో నరరూప రాక్షసుల్ని అదుపులోకి తీసుకోవటంతో దేశం.. భారీ ఉగ్రకుట్ర నుంచి తప్పించుకున్నట్లైంది.