ఆ ధైర్యం బాబు చేస్తే.. వీరికి చెక్ పెట్టొచ్చు...!

Update: 2021-12-13 05:04 GMT
పార్టీని సంస్క‌రిస్తాన‌ని ప‌దే ప‌దే చెబుతున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏవిధంగా చేస్తారు? పార్టీలో నేత‌ల‌ను గాడిలో పెడ‌తాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. ఎలా పెడ‌తారు? ఈ క్ర‌మంలో ఎదుర‌య్యే స‌మ‌స్య ల‌ను ఆయ‌న త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌రా? త‌మ్ముళ్ల దూకుడును నిలువ‌రించేలా ఆయ‌న చ‌ర్యలు చేప‌ట్ట‌గ‌ల రా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగానే ఉంది.

చాలా మంది గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన త‌ర్వాత‌.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. వాస్త‌వానికి గెలిచిన నాయ‌కులు కూడా ఒక‌రిద్ద‌రు అంటీముట్ట‌న‌ట్టు ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వీరిని ప‌క్క‌న పెట్టాల‌నేది పెద్ద ఎత్తున చంద్ర‌బాబుపై పెరుగుతున్న డిమాండ్‌. ఈ డిమాం డ్ మేర‌కు ప‌నిచేయ‌ని వారిని ప‌క్క‌న పెట్టే ధైర్యం బాబు చేయ‌గ‌ల‌రా? అనేది ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఒక ఈ ధైర్య చేసినా.. ఆయ‌న వెంట‌నే మ‌రో సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకోవాలి. అదేంటంటే.. ఈ పాత వారి స్థానంలో కొత్త ముఖాల‌కు అవ‌కాశం క‌ల్పించాలి.

ఇది మ‌రింత దైర్యంతో కూడుకున్న ప‌ని. ఎలా అంటే.. ఇప్ప‌టికే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు.. పార్టీకి అతీతంగా వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను పెంచుకున్నారు. దీంతో ఇక్క‌డ వీరి హ‌వా న‌డుస్తోంది. అయితే.. వీరు పార్టీని త‌మ చేతుల్లోకి తీసుకున్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇలాంటి వారి విష‌యంలోనే చంద్ర‌బాబు ప్ర‌క్షాళ‌న చేస్తాన‌ని చెబుతున్నారు. ఓకే! ఇలానే చేశార‌ని అను కుందాం. వీరి స్థానంలో కొత్త ముఖాల‌ను తీసుకువ‌చ్చి.. నిల‌బెట్టాలి. వారిని గెలిపించాలి.

అప్పుడు కానీ.. చంద్ర‌బాబుపై పార్టీలో భ‌య భ‌క్తులు పెర‌గ‌వు. కానీ, ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా.? చంద్ర‌బాబు అంత‌ర్గ తంగా ఎదుర‌వుతున్న అనేక స‌వాళ్ల‌లో ఇది కీల‌కంగా మారింది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు నిలేసుకు పోయిన నాయ‌కులు.. త‌మ‌ను క‌ద‌లించ‌లేర‌ని.. త‌మ‌ను క‌దిలిస్తే.. పార్టీకే న‌ష్ట‌మ‌నే భావ‌నతో ఉన్నారు. ఇలాంటి వారితోనే పార్టీ న‌ష్ట‌పోతోంద‌ని చంద్ర‌బాబుకు కూడా తెలుసు.

అందుకే ఆయ‌న మ‌ధ్య మ‌ధ్య ప్ర‌క్షాళ‌న పేరుతో హ‌డావుడి చేస్తున్నారు. అయితే.. ప్ర‌క్షాళ‌న అంటే.. వీరిని ప‌క్క‌న పెట్టి.. కొత్త వారికి అవ‌స‌ర‌మైతే. అవ‌కాశం క‌ల్పించి.. వారిని గెలిపించుకుంటే.. అప్పుడు నిజంగానే చంద్ర‌బాబుకు పార్టీలో తిరుగులేకుండా పోతుంది.

కానీ.. ఎక్కడ ఏం చేసినా.. ఫ‌ర్వాలేదు.. ఇత‌ర పార్టీల్లోకి వెళ్లి తిరిగి వ‌చ్చినా.. చేర్చుకుంటార‌నే భావ‌న‌.. పార్టీలో అంద‌రిలోనూ స‌ర్వ‌వ్యాప్త‌మైన‌ప్పుడు.. ఎవ‌రు మాత్రం ఏం చేస్తారు. అందుకే.. చంద్ర‌బాబు కొత్త ముఖాల‌కు ఛాన్స్ ఇచ్చి.. గెలిపించుకునే ధైర్యం ఉంటే.. త‌ప్ప‌కుండా.. పార్టీ గాడిన పడుతుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News