చంద్రబాబు గురివింద నీతి

Update: 2021-02-07 17:30 GMT
‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా అనర్హుడు..వెంటనే ఆయన్ను బర్తరఫ్ చేయాలి’  ఇది తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు చేసిన డిమాండ్. పెద్దిరెడ్డి మంత్రిగా ఎందుకు అనర్హుడు అంటే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డను బెదిరించారట. నిజమే ఎన్నికల కమీషనర్ ను బెదిరించటం తప్పే అనటంలో సందేహం లేదు. అంతమాత్రానికే పెద్దిరెడ్డిని మంత్రిగా అనర్హుడిని చేసేశారు చంద్రబాబు.

కాస్త చరిత్రలోకి వెళితే 2019 ఎన్నికల సందర్భంగా సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు చేసిందేమిటి ? అప్పటకి కేంద్ర ఎన్నికల కమీషనర్ గోపాలకృఫ్ణ ద్వివేదిని బెదిరించలేదా ? ఏకంగా ఆయన ఆఫీసుకే వెళ్ళి పక్కనే కూర్చుని ఎన్నికలైపోయిన తర్వాత వదిలిపెట్టేది లేదంటూ బెదిరించిన ఘటన అప్పట్లో సంచలనమైంది. అంతేకాకుండా ద్వివేది తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా కమీషన్ కార్యాలయం ముందే టీడీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేసిన విషయం అందరికీ గుర్తుంది.

ఇప్పుడు నిమ్మగడ్డ చేస్తున్నట్లుగా అప్పట్లో ద్వివేది ఏ ఒక్కరితోను గొడవలు పెట్టుకోలేదు. ఇపుడు నిమ్మగడ్డ తన పరిధి దాటిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తానొక్కడే రాజ్యాంగానికి అతీవమన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మొదటినుండి నిమ్మగడ్డ వ్యవహార శైలి ఏకపక్షంగా ఉందని, చంద్రబాబుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలకు అవకాశాలు ఇచ్చాయి. కానీ అప్పుడు ద్వివేది చర్యలను చంద్రబాబు, టీడీపీ తప్ప మరెవరు తప్పుపట్టలేదు.

అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ ఏబి వెంకటేశ్వరరావును కేంద్ర ఎన్నికల కమీషన్ బదిలి చేస్తే చీఫ్ సెక్రటరీ పునేతతో కోర్టులో కేసు వేయించారు. ఏబి బదిలీపై కేంద్ర ఎన్నికల కమీషన్ తో చంద్రబాబు గొడవలు పెట్టుకున్నారు. తర్వాత చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తే ఎన్నికల కమీషన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలతో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న ఎల్వీ సుబ్రమణ్యంను చంద్రబాబుతో పాటు మంత్రులు ఎంతగా వేదించింది అందరికీ తెలిసిందే. తాను అధికారంలో ఉన్నపుడు విచ్చలవిడిగా వ్యవహరించిన చంద్రబాబు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి ప్రజాస్వామ్యం - రాజ్యంగం - విలువల గురించి చెప్పటమంటే గురివింద నీతినే గుర్తుచేస్తోంది.

 
Tags:    

Similar News