• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు భయానికి సీ-ఓటర్...

బాబు భయానికి సీ-ఓటర్ సర్వేనే కారణమా?

By - Tupaki Desk
Update: 2018-01-21 17:30 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు మూడు జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోకపోతే తాను స్వయంగా ఆయా నియోజకవర్గాల్లో నిరాహార దీక్ష చేస్తానన్నారు. చిత్తూరు - శ్రీకాకుళం - అనంతపురం జిల్లాల్లో ఎమ్మెల్యేలు పనిచేయడం లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
    
కాగా రీసెంటుగా వెల్లడైన సర్వే ఫలితాలను చూసి ఆందోళన చెందడం వల్లే చంద్రబాబు ఆ మూడు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కష్టమంటూ రిపబ్లిక్ టీవీ-సీఓటర్ సర్వే రీసెంటుగా తేల్చడం తెలిసిందే. అయితే, చంద్రబాబు ఆ సర్వేను బూటకమంటూ కొట్టిపారేశారు. కానీ.. చంద్రబాబు తాజాగా చేసిన తీవ్ర వ్యాఖ్యలు చూస్తుంటే ఆ సర్వే వాస్తవమేనని చంద్రబాబు నమ్ముతున్నట్లుగానే ఉంది. చంద్రబాబు సొంత సర్వేల్లో కూడా పార్టీ బలహీనపడిన సంగతి తేలిందని, ఇప్పుడు మీడియా సర్వేలూ అదే విషయం వెల్లడించడంతో ఆయన పనితీరు కనబరచని ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారని తెలుస్తోంది.
    
ఆ క్రమంలోనే ఆయన చిత్తూరు - అనంతపురం - శ్రీకాకుళం జిల్లాల ఎమ్మెల్యేలను హెచ్చరించినట్లుగా చెప్తున్నారు.   అక్కడి ఎమ్మెల్యేలకు ఇక కష్టకాలమేనని, పనిచేయకపోతే మీకు ఇబ్బందులు వస్తాయనిఆయన అన్నారు. ‘నేనే వచ్చి మీ దగ్గర నిరహార దీక్ష చేస్తా... అప్పుడైన మీమీద ఒత్తిడి పెరుగుతుంది. గతంలో గాంధీగారు ఇదే పద్దతి అనుసరించార’ని చంద్రబాబు అన్నారు.  అంతేకాదు.. ప్రజలు ఎంతో నమ్మకంతో మనల్ని గెలిపిస్తే పనిచేయకపోతే ఎలా... అని ప్రశ్నించారు. ఆ మూడు జిల్లాల పార్టీ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలన్నారు.
Tags:    
  • Chandrababu Naidu 
  • TDP Leaders 
  • Next Elections 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS