పవన్ కల్యాణ్ కు బాబే ఇన్విటేషన్ ఇస్తారా?
ఏపీ రాష్ట్ర సర్కారు ఇప్పుడు ఊపిరి సలపనంత పనిలో బిజీగా ఉంది. ఏపీ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అందుకు తగ్గట్లే బిజీబిజీగా ఉన్నారు. తన సమర్థత ఎంతన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే శంకుస్థాపనను భారీ ఎత్తున చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ కోణంలోనే ఆయన పనులు చేస్తున్నారు. ఇంత పని ఒత్తిడిలో ఉండి కూడా.. అత్యంత ప్రముఖులకు తానే స్వయంగా ఇన్విటేషన్ ఇవ్వనున్న విషయాన్ని వెల్లడించారు.
అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తానే స్వయంగా ఆహ్వానిస్తానని.. ఇంటికి వెళ్లి మరీ శంకుస్థాపన ఇన్విటేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇన్విటేషన్ ఇవ్వటం ఓకే. మరి.. పవన్ కల్యాణ్ మాటేమిటి? ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించటమే కాదు.. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన పవన్ కు శంకుస్థాపన కార్యక్రమానికి ఇన్విటేషన్ ఎలా ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పవన్ కు సైతం ఏపీ ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లి ఇస్తారా? లేక.. పార్టీ ప్రతినిధులను పంపి ఇన్విటేషన్ ఇస్తారా? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఈ విషయంపై పార్టీ నేతలు సైతం ఒక స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ కు ఇన్విటేషన్ పక్కా. ఆ విషయంలో ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. చంద్రబాబే స్వయంగా ఇస్తారా? లేక.. మంత్రుల బృందాన్ని పంపుతారా? అన్నదే ప్రశ్న.
పవన్ చేసిన సాయానికి తగ్గట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తే మాత్రం తానే స్వయంగా వెళ్లి మరీ పిలవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విషయంలో ఏం తేడా వచ్చినా బాబుపై భారీగా విమర్శలు వెల్లువెత్తే వీలుంది. షూటింగ్ లో బిజీగా ఉన్నారనో.. పనుల ఒత్తిడితోనో పవన్ ను వ్యక్తిగతంగా వెళ్లి కలవటం సాధ్యం కాలేదన్న మాటలు.. చెబితే మాత్రం బాబు సర్కారు మీద అగ్రహం వ్యక్తమయ్యే వీలుందంటున్నారు. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబుకు.. ఎవరిని ఎలా ఆహ్వానించాలో ఇప్పటికే డిసైడ్ అయి ఉండొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్ కు ఇన్విటేషన్ విషయంలో బాబు ఏం చేస్తారో..?