జ‌గ‌న్ నిర్ణ‌యంతో బాబుకు కౌంట్ డౌన్ మొద‌లైన‌ట్లేనా?

Update: 2019-06-07 07:32 GMT
ప్ర‌భుత్వం ఏదైనా కావొచ్చు.. తీసుకునే నిర్ణ‌యాల వెనుక చాలానే క‌స‌ర‌త్తు ఉంటుంది. స్విచ్ వేసినంత‌నే బ‌ల్బ్ వెలిగిన చందంగా. . కొన్ని నిర్ణ‌యాల  ప్ర‌క‌ట‌న పైకి క‌నిపించిన దానికి భిన్నంగా దాని అంత‌ర్యం మ‌రేదో ఉంటుంద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి నిర్ణ‌యాన్నే ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ తీసుకున్నారా? అంటే అవున‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఎన్నిక‌ల వేళ‌లో సీబీఐకు ఏపీలో నో ఎంట్రీ అంటూ జీవో జారీ చేసిన బాబుకు భిన్నంగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. సీబీఐకి స్వాగ‌తం చెబుతూ తాజాగా జీవో విడుద‌ల చేయ‌టం తెలిసిందే. తాజా నిర్ణ‌యం బాబుకు కౌంట్ డౌన్ మొద‌లైన‌ట్లేన‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం బాబు మీద త్వ‌ర‌లో ప‌లు కేసులు సీబీఐ పెట్టే వీలున్న‌ట్లుగా తెలుస్తోంది.

అమ‌రావ‌తి భూముల కేటాయింపు.. ప‌లు టెండ‌ర్ల‌కు ఓకే చెప్పిన తీరుతో పాటు.. అగ్రిగోల్డ్ స్కాం.. మ‌రికొన్ని నిర్ణ‌యాలకు సంబంధించి సీబీఐ విచార‌ణ దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌లు శాఖ‌ల‌తో స‌మీక్షలు నిర్వ‌హించిన ఏపీ సీఎం.. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌ను గుర్తించార‌ని.. వాటి విష‌యంలో సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించే అవ‌కాశం ఉందంటున్నారు. అదే జ‌రిగితే చంద్ర‌బాబుకు బిగ్ ట్ర‌బుల్ రెఢీగా ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News