తెలంగాణలో కాంగ్రెస్ కావాలి..ఏపీలో వద్దా!
అసలు కాంగ్రెస్ పార్టీకి సిగ్గు ఉండాలి.. చంద్రబాబు నాయుడును చేరదీస్తున్నందుకు. కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం తెలివితేటలు ఉన్నా.. చంద్రబాబును పక్కన పెట్టాల్సింది. అయితే కాంగ్రెస్ కు ఇప్పుడు బాబు కన్నా గతి లేదు. అందుకే.. బాబు ఎలా ఆడుతున్నా కాంగ్రెస్ తందానా అంటోంది.
తెలంగాణలోనేమో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ముందుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు. సొంతంగా వెళితే తమ పార్టీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడు. అయితే చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ ను కూడా నిండా ముంచాడు.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొనకపోయుంటే.. చాలా వరకూ మెరుగైన ఫలితాలను సాధించేది. ఈ విషయాన్ని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కూడా అదే మాటే చెబుతున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ నిండా మునిగిందని వారు ఓటమి అనంతరం విశ్లేషిస్తూ ఉన్నారు.
అలా తెలంగాణలో దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీని ముంచిన చంద్రబాబు నాయుడు ఏపీలో మాత్రం కాంగ్రెస్ ను పక్కన పెడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదని ఇది వరకే చెప్పిన చంద్రబాబు నాయుడు.. చివరకు దాన్నే అమలు చేస్తున్నాడు. అక్కడికీ కాంగ్రెస్ వాళ్లు పొత్తు కోసం ఆరాట పడ్డారు.రాహుల్ గాంధీకి అవే నివేదికలు ఇచ్చారు. చంద్రబాబును పొత్తుకు ఒప్పించాలని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ససేమేరా అంటున్నాడు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సంప్రదించినా ఇదే స్పందన వ్యక్తం అయ్యిందని సమాచారం. పైపెచ్చూ కాంగ్రెస్ నుంచినే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిగిలిన నేతలను చేర్చుకుంటూ ఉన్నాడు. అలా కాంగ్రెస్ కు మరో వెన్నుపోటు పొడుస్తున్నాడు. దటీజ్ చంద్రబాబు!