ఈ బ్రీఫ్ డ్ మీ లెట‌ర్ ఏంది బాబు?

Update: 2019-06-06 06:19 GMT
సోష‌ల్ మీడియాలో ఒక లేఖ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఏపీ విప‌క్ష నేత చంద్ర‌బాబు రాసిన లేఖ కావ‌టం ఒక విశేష‌మైతే.. ఇందులో బాబు భాష విస్మ‌యానికి కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌జావేదికను త‌మ‌కు ఇవ్వాల‌ని.. ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న‌కు అనువుగా ఉండే ఈ భ‌వ‌నాన్ని త‌మ‌కు ఇస్తే ఉప‌యోగంగా ఉంటుంద‌ని పేర్కొంటూ జ‌గ‌న్ కు బాబు పేరుతో ఒక రిక్వెస్ట్ లెట‌ర్  పంపిన‌ట్లుగా వార్త‌లు రావ‌టం తెలిసిందే.

ఈ ఇష్యూకు సంబంధించిన లేఖ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంది. ఈ లేఖ‌లో ఉప‌యోగించిన భాష‌.. ఏం చెప్పాల‌న్న విష‌యాన్ని బాబు మాదిరే అదే ప‌నిగా చెప్పిన తీరు.. ప్ర‌తిప‌క్ష నేత ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించేలా ఉండ‌టం క‌నిపిస్తుంది. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. చెప్పాల్సిన విష‌యాన్ని సూటిగా.. మూడు ముక్క‌ల్లో చెప్ప‌టానికి బ‌దులు చెప్పిందే చెప్పిన తీరు విస్మ‌యంగా మారింది.

బాబు సంత‌కం ఉన్న ఈ లేఖ సోస‌ల్ మీడియాలో కామెడీగా మారింది. గుడ్ ఇంగ్లిష్ అని కొంద‌రు ఎట‌కారం అడితే.. దారుణ‌మైన ఇంగ్లిష్ అంటూ ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పేశారు. మ‌రికొంద‌రు బ్రీఫ్ డ్ మీ అంటూ గ‌తాన్ని గుర్తు చేసేలా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.

ఇదంతా ఎందుకంటే.. లెట‌ర్ లో బాబు ఉప‌యోగించిన భాష‌నే చెప్పాలి. హైటెక్ ముఖ్య‌మంత్రిగా.. సీఎం కాదు సీఈవో అంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌ట‌మే కాదు.. సాంకేతిక‌త విష‌యంలో త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని.. సీనియార్టీని త‌న‌కు తానుగా తీసేసుకునే చంద్ర‌బాబు.. ఒక ముఖ్య‌మంత్రికి రాయాల్సిన రిక్వెస్ట్ లెట‌ర్ ఇలానేనా ఉండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

అయ్యా.. మాకు ప్ర‌జావేదిక అవ‌స‌రం ఉంది. నాకున్న అవ‌స‌రాల‌కు మీరు పెద్ద మ‌న‌సుతో ప్ర‌జావేదిక‌ను ఇస్తే నాకు ఉప‌యోగ‌ప‌డుతుంది. నా విన్న‌పానికి సానుకూలంగా స్పందిస్తార‌న్న మూడు ముక్క‌ల్ని ముచ్చ‌ట‌గా చెప్పేస్తే స‌రిపోయే దానికి అందుకు భిన్నంగా.. అవ‌స‌ర‌మైన వాటి కంటే అన‌వ‌స‌ర‌మైన అంశాల్ని ప్ర‌స్తావిస్తూ లెట‌ర్ రాయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ప్ర‌శ్న. ఏమైనా లెట‌ర్ రాసే విష‌యంలోనూ బాబు వైఫ‌ల్యం చూస్తే.. ఈ నాయ‌కుడి నేతృత్వంలో రాష్ట్రంలో పాల‌న ఎలా సాగింద‌న్న సందేహం రాక మాన‌దు.

Tags:    

Similar News