ప‌వ‌న్ డౌట్లు తీర్చేసిన చంద్ర‌బాబు

Update: 2018-03-08 05:59 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న సందేహాలు అన్నిఇన్ని కావు. నిజానికి ఆ విష‌యంలో ఆయ‌న్ను త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. సీరియ‌స్ పాలిటిక్స్ చేసే వారికి.. జ‌నంతో మ‌మేకం అయ్యే వారికి ఈతి బాధ‌లు తెలుస్తుంటాయి. ఇక‌.. అస‌లేం జ‌రుగుతుందో అన్న విష‌యాన్ని వివ‌రించ‌టానికి పార్టీ విస్త‌రించి ఉంటే.. స‌మాచారం ఈజీగా వ‌స్తూ ఉంటుంది. కానీ.. పార్టీకి ఇప్ప‌టికి తానొక్క‌డే అన్ని అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప‌వ‌న్ కు కొన్ని కీల‌క అంశాల మీద బోలెడ‌న్ని డౌట్లు.

ప్ర‌త్యేక ప్యాకేజీ అని చెప్పిన కేంద్రం.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏపీకి ఏం ఇచ్చింది?  విభ‌జ‌న హామీల్లో కేంద్రం ఎంత‌మేర నెర‌వేర్చింది?  ఇలాంటి సందేహాలుఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిని తేల్చేందుకు ఉండ‌వ‌ల్లి.. జేపీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖుల‌తో నిజ నిర్దార‌ణ క‌మిటీని వేయ‌టం.. వారు శోధించి.. శోధించి లెక్క‌లు తేల్చ‌టం తెలిసిందే.

ప‌వ‌న్ కున్న డౌట్లు తీర్చాల‌నుకున్నారో.. లేక త‌న వాద‌న ఎంత నిజ‌మ‌న్న‌ది ప్ర‌జ‌ల‌కు వివ‌రంగా చెప్పాల‌నుకున్నారో కానీ తాజాగా ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ఒక పుస్త‌కాన్ని అచ్చేయించారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

ప్ర‌త్యేక హోదా.. ప్యాకేజీతో పాటు మొత్తం 19 అంశాల గురించి ఇందులో ప్ర‌స్తావించారు. గ‌ణాంకాలు.. లెక్క‌ల‌తో స‌రిపెట్ట‌కుండా.. ఆయా అంశాల‌పై కేంద్రానికి చెందిన పెద్ద‌లు ఎప్పుడేం అన్నారు?  వాటికి చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు ఎలా స్పందించార‌న్న వివరాల్ని అందులో పొందుప‌ర్చారు. మొత్తం 50 పేజీలున్న ఈ పుస్త‌కంలో మోడీ స‌ర్కారు త‌మ‌కేం చెప్పింది?.. వాస్త‌వానికి త‌మ‌కేం ఇచ్చింద‌న్న వివ‌రాల‌తో పాటు.. త‌మ త‌ప్పులేమీ లేవ‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసే ప్ర‌య‌త్నం తాజా పుస్త‌కంతో జ‌రిగింద‌ని చెప్పాలి.

పుస్తకం మొత్తం కేంద్రం చెప్పిన మాట‌ల్లో ఎన్ని త‌ప్పులు దొర్లాయ‌న్న విష‌యాన్ని వివ‌రించేది ఉన్న‌ట్లుగా ఉంది. అదే స‌మ‌యంలో.. బాబు మాట‌లు వివ‌రంగా ఉండ‌టంతో పాటు.. తాను ఎక్క‌డా త‌ప్పు చేయ‌లేద‌న్న భావ‌న క‌లిగేలా పుస్త‌కంలోని వివ‌రాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. తాజా పుస్త‌కం ఎవ‌రికెంత సాయం గా ఉంటుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ప‌వ‌న్ కు ఉన్న డౌట్లు చాలావ‌ర‌కూ తీర్చేలా వివ‌రాలు ఉన్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కాకుంటే.. అవ‌న్నీ బాబు కోణంలో అన్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News