కొత్త రాష్ట్రంలో పాత చంద్రబాబు - 1
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పదేళ్లు పరిపాలించిన ముఖ్యమంత్రి ఆయన.. ఆ కాలంలో పాలనను, అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారని ఎంతగా పేరు తెచ్చుకున్నారో అంతేస్థాయిలో విమర్శలూ ఎదుర్కొన్నారు. ఐటీ రంగాన్ని, సేవారంగాన్ని రెండు భుజాల మీద మోసిన ఆయన నాగలి భుజాన వేసుకుని తిరిగే రైతును మాత్రం మర్చిపోయారు... చిరిగిన తుండుగుడ్డను భుజానేసుకుని బిక్కచూపులు చూసే బీదలను కూడా మర్చిపోయారు. ఫలితం... ఎన్నికల్లో ఓటమి.. పదవికి దూరం.. పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాల్సి రావడం..ప్రస్తుత నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత చరిత్ర ఇది.. అందులో మెరుపులు మరకలు రెండూ ఉన్నాయి... విరామం తరువాత మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఆయన పాత దారిలోనే సాగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాను మారిన మనిషినని చెబుతున్నా ఇంకా ఆయన ప్రాధాన్యాలు మారినట్లుగా కనిపించడం లేదు. రైతులు - పేదలను పూర్తిస్థాయిలో పట్టించుకున్నట్లుగా ఏమాత్రం అనిపించడం లేదు.. పథకాలు ప్రవేశపెడుతున్నా వాటి పేర్లే వినిపిస్తున్నాయి కానీ ఫలితాలు కనిపించడం లేదు... హామీలు ఇస్తున్నా వాటిని నెరవేర్చడంలో చిత్తశుద్ధి ఉండడంలేదు. గత టెర్ములోనే బ్రహ్మాండమైన పాలకుడిగా ప్రపంచం ప్రశంసలు అందుకున్న చంద్రబాబునాయుడు ఇప్పుడూ అదే డప్పు శబ్దం వినడానికి ఇష్టపడుతున్నారే కానీ.. రాష్ట్రంలోని రైతుల ఇళ్లలో మోగుతున్న చావు డప్పుల ధ్వనులు వినలేకపోతున్నారు. గత ప్రభుత్వాల వైఫల్యమా.. చంద్రబాబు లోపమా అన్నది పక్కనపెడితే సవాలక్ష కారణాలతో రైతులు చచ్చిపోతున్నారన్నది మాత్రం వాస్తవం. ఎన్నో చేస్తానని చెబుతున్నా... చేయాలని అనుకుంటున్నా చంద్రబాబు ఏమీ చేయడం లేదన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోపణ. అందరూ గుర్తిస్తారు అనుకున్నవి... మన ప్రత్యేకత చాటుకోవచ్చనుకున్నవి... ప్రపంచం కీర్తిస్తుంది... ఆహా చంద్రబాబు, ఓహో చంద్రబాబు అంటుంది అన్న పనులకు మాత్రమే ఆయన ప్రాధన్యమిస్తున్నారన్న విమర్శలున్నాయి.
మళ్లీ అదే తప్పు
చంద్రబాబు తన పాత పద్ధతిలోనే సాగుతున్నారని.. రైతులు- పేదలకు ఏమాత్రం లబ్ధి కలగడం లేదన్న భావన రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉంది. రుణమాఫీతో 24 వేల కోట్ల మేర రైతుల అప్పులు మాఫీ చేశామని చంద్రబాబు, టీడీపీ చెబుతున్నా ఆ రుణమాఫీ పొందడానికి పడిన కష్టం అప్పుల కష్టం కంటే ఎక్కువైందని రైతులు అంటున్నారు. పూర్తి స్థాయిలో రుణాలు మాపీ కాకపోవడం.. మాఫీలో చాలా నిబంధనలు ఉండడం... చాలా ఎక్కువ సమయం పట్టడం.. ఈలోగా బ్యాంకులు ఒత్తిళ్లు... బంగారం రుణాల్లో సమస్యలు... ఆదార్ కార్డుతో మెలికలు.. ఒకటా రెండా నానా తిప్పలు పడితే రైతులకు మాఫీ అయింది నామమాత్రమే. దీంతో చంద్రబాబు రుణమాఫీ చేశారన్న సంతోషం ఒక్క రైతు ముఖంలోనూ కనిపించలేదు. మూడు విడతలుగా మాఫీ చేసినా ఇప్పటికీ రూపాయి కూడా మాఫీ కానివారున్నారు. అప్పీళ్ల మీద అప్పీళ్లు చేస్తున్నా ఏమాత్రం ప్రయోజనం ఉండడం లేదు. మాకు రుణమాఫీ వర్తించలేదని దరఖాస్తులు చేసుకుంటే నో డాటా అంటూ పక్కన పడేస్తున్నారు. ఎమ్మార్వోలు - కలెక్టర్లు.. వ్యవసాయ శాఖ అధికారులు - చివరకు హైదరాబాద్ లోని రుణమాఫీ ఫిర్యాదుల కేంద్రంలోనూ అప్పీళ్లు చేసిన రైతులున్నారు. వారికి పట్టాదారు పాసుపుస్తకం - రేషన్ కార్డు - ఆధార్ అన్నీ ఉన్నా - అర్హతలున్నా ఒక్క రూపాయి రుణం కూడా మాఫీ కాలేదు. దీంతో నిజమైన రైతులంతా నమ్మకం కోల్పోయారు.
రైతు మిగులుతాడా...?
మరోవైపు సకాలంలో రుణమాఫీ కాక.. కొత్త రుణాలు షెడ్యూల్ కాకపోవడంతో పంటలకు పెట్టుబడులుగా అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులు... ఆ తరువాత పంటలు సరిగా పండక, అప్పులు తీర్చలేక ఉరేసుకుంటున్నారు. ఒక్క రాయలసీమలోనే సెప్టెంబర్ నెలలో ఇప్పటి వరకు 32 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. అయితే.. ఏపీలో రైతుల ఆత్మహత్యలు తెలంగాణ కంటే తక్కువే అంటే సిగ్గుమాలి సరిపెట్టుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం సక్రమంగా రుణ మాఫీ చేసి ఉంటే రైతులెందుకు మరణశయ్య ఎక్కుతారు? ఆత్మహత్యలు అంతకంతకూ ఎందుకు పెరుగుతాయి? ఇప్పటి వరకు పత్తి రైతులకే పరిమితమైన ఆత్మహత్యలు పొగాకు, వేరుశనగ, చెరకు రైతులకూ విస్తరించడంతో అసలు రైతన్నవాడు మిగులుతాడా అన్న ఆందోళన కలుగుతోంది. రైతులను విస్మరించి ప్రాథమికరంగ మిషన్, రెండంకెల వృద్ధి సాధ్యమవుతుందా...? కానే కాదు.. కానీ, చంద్రబాబు మాత్రం ఈ విషయంలో నేల విడిచి సాము చేస్తున్నారు.
ఆడపడుచుల సొమ్ము హారతి
.. ఇక డ్వాక్రా మహిళలకు రుణమాఫీ విషయానికొస్తే అక్కడా పిల్లిమొగ్గలే. రైతు రుణమాఫీ కనీసం ఎంతో కొంత చేశారు. కానీ డ్వాక్రా మహిళలకు అదీ లేదు. లక్షల్లో ఉన్న సంఘాలను నిలువునా మోసగించారు. ఎన్నికల మేనిఫెస్టోల ఇచ్చిన హామీని మర్చిపోయారు. రుణ మాఫీ చేయకుండా కేవలం 10 వేల మ్యాచింగ్ గ్రాంట్ ప్రకటించి.. అది కూడా మూడు విడతల్లో మూడేసి వేల చొప్పున ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని మహిళాసంఘాల సభ్యులంతా చంద్రన్న ఆడపడుచుల సొమ్ము మింగేసాడని మండిపడుతున్నారు.
తన గత పరిపాలనలో పాటించిన విధానాలే పాటిస్తూ పైకి మాత్రం రైతుల సంక్షేమమే ధ్యేయమని చెబుతుండడాన్ని ఎవరూ విశ్వసించడం లేదు. సంపద సృష్టించడం... ప్రపంచంతో సంబంధబాంధవ్యాలు ఏర్పరిచి స్థాయి పెంచడం... ప్రాజెక్టులు, భవనాలు, రవాణాసౌకర్యాలు, సాంకేతిక సొబగులు వంటి విషయాల్లో చంద్రబాబు సక్సెస్ ఫుల్ కావొచ్చు కానీ రైతులు, పేదలు, కూలీల బతుకులు మార్చడంలో మాత్రం చంద్రబాబు విఫలమవుతున్నారు. కొద్దిమందికి కలిగిన లబ్ధిని చూసి మురిసిపోతూ ఎక్కువమంది పడుతున్న కష్టాలను విస్మరిస్తున్నారు. పనిరాక్షసుడైన చంద్రబాబు ఈ పద్ధతి మార్చుకోనంత వరకు నిద్రాహారాలు మాని పనిచేసినా నిద్రపోతున్నట్లే లెక్క.
-గరుడ
Disclaimer: Views expressed in this article are of the writer and do not represent the views of tupaki.com, and not necessarily reflect the opinions of the organisation either.