భాజపాకు చెక్ పెట్టేందుకు బాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ పరిధిలో ఎక్కడ చిన్న పార్టీ సమావేశం జరిగినా చాలు.. ఎవరో ఒక భాజపా నాయకుడు ఒక స్టాక్ డైలాగు వల్లించడం చాలా సాధారణ విషయం అయిపోయింది. అదేంటంటే.. 2019 ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో స్వతంత్రంగా పోటీచేస్తుంది. ఆ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపడుతుంది. ప్రస్తుతం చంద్రబాబునాయుడుతో పొత్తుల్లో ఉన్న ఆ పార్టీ, ఆయన పార్టీతో కలిసి అధికారం కూడా పంచుకుంటున్న భాజపా నాయకులు పదేపదే వచ్చే ఎన్నికల్లో అధికారం మా ఒక్క పార్టీదే అంటూ ఉండడం.. తెదేపాలో ప్రతి వారికీ కూడా కంటగింపుగానే ఉండవచ్చు. అయితే మిత్రధర్మం అనే పదం వాడుతూ.. వారికి రిటార్టులు ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్తగా రోజులు నెట్టుకొస్తున్నారు.
అయితే చంద్రబాబు చాణక్యనీతిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేయాల్సి వచ్చినా సరే..సిద్ధంగా ఉండే స్థాయికి వెళ్లడానికి ఆ పార్టీ కసరత్తు చేస్తున్నదని ఆయన గ్రహించకపోలేదు. అందుకే కాబోలు.. ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా వారికి ఠికానా లేని పరిస్థితిని సృష్టించాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చడానికి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోనుంది. సోమవారం నాటి ఏపీ కేబినెట్ భేటీలో ఈ సంగతి తేలుతుందని అనుకుంటున్నారు.
రాష్ట్రంలో బాగా బలపడాలని అనుకుంటున్న భాజపా.. కులం పరంగా కాపుల మీదే కన్నేసింది. రాష్ట్రంలో ప్రధానమైన రెండు కులాలు రెండు పార్టీలను ఓన్ చేసుకున్న తరుణంలో.. భాజపా మాత్రం.. కాపులను చేరదీస్తోంది. కాపు వర్గంలో ఒకరికి మంత్రి పదవి ఇప్పించింది. కొందరు కాపు ప్రముఖులను పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు సోము వీర్రాజును రాష్ట్ర అధ్యక్షుడు చేయడం ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలనుకుంటోంది.
అందుకే చంద్రబాబు ముందుగానే మేల్కొన్నారు. భాజపా కాపులకు గేలం వేయడానికంటె ముందుగానే.. ఆయన వారికి తాయిలం పంచి పెట్టేస్తున్నారు. ఆ కులాన్ని తన ఖాతాలో గంపగుత్తగా కలిపేసుకోవడానికి.. బీసీల్లో చేర్చే గిఫ్టు ఇవ్వబోతున్నారు. మరి భాజపా తమ స్ట్రాటెజీ మారుస్తుందో.. లేదా అదే బాటలో గుడ్డిగా సాగిపోతుందో చూడాలి.