• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు స్కెచ్ మారింది...

బాబు స్కెచ్ మారింది చూశారా?

By - Tupaki Desk
Update: 2016-11-22 22:30 GMT
పెద్దనోట్ల రద్దుతో ప్రజల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీపై పెరుగుతున్న వ్యతిరేకత ప్రభావం తమపై పడకుండా టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. గతంలో పెద్దనోట్ల రద్దుకు మ‌ద్ద‌తుగా మాట్లాడిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం చంద్రబాబు - ఇప్పుడు జనం పడుతున్న కష్టాల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అదే రీతిలో మంత్రులు - ఎంపీలు సైతం న‌డుస్తున్నారు. జనంలో మోదీ నిర్ణయంపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో, తాము పెద్దనోట్ల రద్దును స్వాగతించటం కంటే దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి వాటినే ప్రస్తావించి మాట్లాడటం ద్వారా ‘పెద్ద’మరక వదిలించుకోవాలని తెదేపా నాయకత్వం భావిస్తోంది. ఇన్నిరోజులయినా పరిష్కారం కాని సమస్యను తన రాజకీయ జీవితంలో ఇప్పుడే చూస్తున్నానని బాబు కూడా వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. అయితే దీని వెనుక ఎప్ప‌ట్లాగే చంద్ర‌బాబు న‌మ్మే "స‌ర్వే" మంత్రం ఉంద‌ని స‌మాచారం.

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ముందుగా స‌మ‌ర్థించిన టీడీపీ తాజాగా యూ ట‌ర్న్ తీసుకుంది. టీడీపీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ఏకంగా నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు - ప్రధానిపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య చర్చనీయాంశమయింది. ఎన్నికల్లో భార్యపిల్లలు లేని వారిని అనర్హులుగా ప్రకటించాలని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య పరిశీలిస్తే మోదీ నిర్ణయం వల్ల ప్రజల్లో మొదలైన వ్యతిరేకత - తమను ఎక్కడ తాకుతుందోనన్న ఆందోళన అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. దానికి తగినట్లే నియోజకవర్గ ప్రజలు మంత్రులు - ఎమ్మెల్యేలను నోట్ల కష్టాలపై నిలదీస్తున్న పరిస్థితి. ఇలాంటి ఘాటు కార‌ణంగానే మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ అనుభవజ్ఞుడైన బాబు సలహాలు తీసుకుంటే ఈ సమస్య వచ్చేదికాదన్నారు. ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రజలు ఇబ్బందులు పడుతుండటం బాధాకరమని, దానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం బాబు కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

పెద్దనోట్ల రద్దుపై ముందు అందరికంటే ఎక్కువగా మాట్లాడి దెబ్బతిన్న తెదేపా ఇప్పుడు జనస్పందన - ప్రతికూల ఫలితాలు పరిశీలించి, ఇంకా మేల్కొనకపోతే ప్రజల్లో దెబ్బతింటామన్న అంతిమ నిర్ణయానికి వచ్చింది. ఇకపైనా నోట్లపై ప్రజలు పడుతున్న కష్టాలతోపాటు - వాటికి ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి వ్యూహాన్నే అమలుచేయాలని నిర్ణయించింది. అయితే అక‌స్మాత్తుగా ఇలా ప్లేటు పిరాయించేందుకు చంద్ర‌బాబు స‌దా న‌మ్మే "స‌ర్వే"లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. తెదేపా వైఖరి మారేందుకు ఆ పార్టీ కొద్దిరోజుల నుంచి చేస్తున్న సర్వేలు కూడా కారణమంటున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలే తప్ప నల్లధనం ఉన్న వారెవరూ ఇబ్బందిపడటం లేదని, రాజకీయనాయకులు ఎక్కడా ఏటీఎంలలో కనిపించడం లేదన్న అభిప్రాయం ఆ సర్వేలో వెల్లడయింది. మోదీ నిర్ణయం వల్ల చంద్రబాబు కూడా అప్రతిష్టపాలవుతున్నారన్న నివేదికలు వస్తున్నాయి. అందుకే ముందు పెద్దనోట్ల రద్దుపై రోజూ మాట్లాడిన బాబు, ఇప్పుడు ప్రజలు పడుతున్న కష్టాలు, వారికి ప్రత్యామ్నాయంగా 100, 50 నోట్లను అందుబాటులో ఉంచాలంటూ రోజూ సమీక్షలు పెట్టి బ్యాంకర్లను కోరుతున్నారు. కేంద్రానికి వరసపెట్టి లేఖలు రాస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చన్న లక్ష్యం కనిపిస్తోంది.

మోదీ నిర్ణయం వల్ల రాజకీయంగా టీడీపీ కంటే తమకే ఎక్కువ నష్టం కలిగిస్తుందన్న ఆందోళన తెదేపా నాయకత్వంలో ఉందని స‌మాచారం. మిత్రపక్షంలో ఉన్నందున ఆ మరక తమకూ అంటుతుందని, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దీనిపై పెద్దగా ఆందోళన వ్యక్తం చేయకపోవడాన్ని కూడా తెదేపా నాయకత్వం నిశితంగా గమనిస్తోంది. పెద్దనోట్ల రద్దు వల్ల ఇటీవల బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్టల్రో నీటి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన వైనాన్ని తెదేపా నాయకత్వం గ్రహించింది. తాజాగా మోదీ సొంత రాష్టమ్రైన గుజరాత్‌ లో పార్టీలతో సంబంధం లేకుండా రైతులే వచ్చి - పాతనోట్లను రోడ్డుమీద వేయడం వంటి సంఘటనలు మోదీపై పెరుగుతున్న వ్యతిరేకతగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. దీంతో త‌మకు మ‌ట్టి అంట‌కుండా ప‌ని కానిచ్చుకుపోయే వ్యూహాన్ని అవ‌లంభిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chandrababu Naidu 
  • High Value Notes Ban 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS