చంద్రబాబుది ఉద్యమం..జగన్ ది కాదా?
అసలు ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా మాటలు మార్చాడో అందరికీ తెలిసిన సంగతే. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక హోదాతో ఏమీ రాదు.. ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రం డెవలప్ కాలేదు.. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది? ఎవరైనా ప్రత్యేకహోదా అంటే వారు జైలుకే..అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు.. తెలుగుదేశం నేతలంతా ఇలానే మాట్లాడారు.
ప్రత్యేక హోదాకు మించి సాధించినట్టుగా.. ప్రత్యేకహోదా కన్నా ఎక్కువ లబ్ధిని కలిగించినట్టుగా..రాష్ట్రానికి కేంద్రం నుంచి భారీగా నిధులను రాబట్టినట్టుగా.. చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. ప్రత్యేక హోదాతో అవసరమే లేదని.. కేంద్రం ఎంతో చేసిందని అసెంబ్లీలో తీర్మానం కూడా ప్రవేశ పెట్టింది చంద్రబాబు నాయుడు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించాడు. ఇప్పుడేమో.. ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నాడు. ఇలా రాజకీయం చేస్తూ ఉన్నాడాయన. బాబు ద్వంద్వ వైఖరి ప్రజలందరికీ అర్థం అవుతూనే ఉంది.
అయితే ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్న తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం.. బాబు ఏదో ఉద్యమించినట్టుగా ప్రచారం చేస్తోంది. చంద్రబాబుది గొప్ప ఉద్యమం అని చెబుతోంది. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తూ ఉంటే..పచ్చ మీడియా వర్గాలు మాత్రం.. ప్రజలను వెర్రివాళ్లను చేస్తూ.. బాబు ఉద్యమం గురించి ఒక రేంజ్లో ప్రచారం చేస్తూ ఉన్నాయి.
ఇది వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా కోసం చాలా కార్యక్రమాలు చేపట్టాడు. ఢిల్లీలో దీక్ష చేశాడు. ప్రత్యేకహోదా విషయంలో నిరాహార దీక్ష చేశాడు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా అనేక సదస్సులు నిర్వహించాడు. వర్సిటీల్లో విద్యార్థులతో, మేధావులతో ఆ విషయమై జగన్ సదస్సులు నిర్వహించాడు.
అయితే అప్పుడు జగన్ కు తెలుగుదేశం అనుకూల మీడియా ఎలాంటి కవరేజీ ఇవ్వలేదు. జగన్ రాజకీయం గురించి కాకపోయినా.. రాష్ట్ర శ్రేయస్సు గురించి అయినా.. ప్రత్యేకహోదా ఉద్యమం గురించి కవరేజ్ ఇవ్వాల్సింది. అయితే అప్పుడు బాబు వాదననే పచ్చ మీడియా హైలెట్ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరం లేదని బాబు అప్పుడు వాదించాడు.
ఇప్పుడు మాట మార్చి అవకాశవాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇదీ తెలుగుదేశం అనుకూల మీడియా తీరు. రాష్ట్రంలో మెజారిటీ మీడియా ఇలాగే పని చేస్తూ ఉండటం రాష్ట్రానికే మోసం చేయడమే ఇది.