14 నెలల బాబు పాలనలో 17 వేల కోట్ల అప్పు..?
విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైన విషయం తెలిసిందే. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి హంగు.. ఆర్భాటం ఏమాత్రం తగ్గటం లేదు. ఇక.. ఉద్యోగులు.. వివిధ వర్గాలకు చెందిన వారు ఆందోళనలు చేయటం.. వారి డిమాండ్లకు ఓకే చెప్పేస్తూ హామీలు ఇవ్వటమే కాదు.. భారీ ఎత్తున వరాలు ఇచ్చేస్తున్న వైనం తెలిసిందే.
వీటికి తోడు చంద్రన్న సంక్రాంతి కానుక.. రంజాన్ తోఫాలు లాంటివి ఉండనే ఉన్నాయి. ఈ మధ్యనే ముగిసిన గోదావరి మహా పుష్కరాలకు ఏకంగా రూ.1300 కోట్ల వరకూ ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. ఓపక్క విభజన కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెబుతూనే.. ఇన్ని ఖర్చులు ఎలా పెడుతున్నారు. అలా అని కేంద్రం ఏమైనా నిధులు ఇస్తుందా? అంటే అదీ లేదు.
ఆదాయం పెరిగిందా? అంటే అదీ లేదు. ఏమీ లేకుండానే ఇన్ని కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మేజిక్ ఏమిటని చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. నెలా.. నెలా అప్పుల మీద అప్పులు తెస్తూ.. బండి నడిపిస్తున్నారు. అన్నింటికంటే దారుణమైన విషయం.. గతంలో తెచ్చిన అప్పుల వడ్డీలు తీర్చేందుకు సైతం కొత్త అప్పులు చేయటం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న దానికి ఒక్క గణాంకం చెబితే.. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత గడ్డుగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఏపీ విభజన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ వాటా కింద వచ్చిన అప్పు అక్షరాల రూ.67,441కోట్లు బదిలీ అయ్యింది. ఏపీ కోసం విదేశీ ఆర్థిక సాయం తీసుకున్న లెక్క పంచాయితీ ఇంకా తేల్లేదు. విభజన ఇంకా పూర్తి స్థాయిలో జరగకపోవటం వల్ల ఆ మొత్తం అప్పులో లెక్క కట్టలేదు. అధికారుల అంచనా ప్రకారం.. ఆ అప్పు సుమారు రూ.6వేల కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అంటే.. కాస్త అటూఇటూగా 73వేల కోట్ల రూపాయిలన్న మాట.
ఇక.. విభజన తర్వాత కొలువు తీరిన చంద్రబాబు సర్కారు 14 నెలల కాలంలో ఏపీ అప్పు ఎంతకు చేరుకుందో తెలుసా..? అక్షరాల రూ.90వేల కోట్లు అంటే.. విభజన నాటి ఏపీకి వచ్చిన అప్పు రూ.73వేల తాజా అప్పు రూ.90వేల కోట్లలో తీసేస్తే..
చంద్రబాబు తన 14 నెలల్లో తీసుకొచ్చిన అప్పు అక్షరాల రూ.17వేల కోట్లు (చిల్లర మొత్తం మినహాయిస్తే) అవుతుంది. అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు మాటల్లో నిజం ఎంతన్నది.. 14 నెలల స్వల్ప వ్యవధిలో బాబు సర్కారు చేసిన అప్పు చూస్తే తెలిసిపోతుంది. 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో అప్పు రూ.67వేల కోట్లు ఉంటే.. కేవలం 14 నెలల స్వల్ప వ్యవధిలో కొత్తగా వచ్చి చేరిన అప్పు రూ.17వేల కోట్లు అంటే.. ఆంధ్రోడి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నట్లు..?