జమిలి ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
గడిచిన కొద్దికాలంగా మీడియాలో అప్పుడప్పుడు బ్యానర్ గా వచ్చే జమిలి ఎన్నికల మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. జమిలి ఎన్నికలు 2022లో వస్తే అందరూ సిద్ధంగా ఉండాలన్న ఆయన కొత్త చర్చకు తెర తీశారు. పార్టీ నేతలతో మాట్లాడిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు.
తన చేతకాని పాలనతో జగన్ చేతులు ఎత్తేశారన్నారు. పులివెందుల రాజ్యాంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారని.. కోర్టులపైనే జగన్ వర్గం ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసుల మాఫీ కోసం కేంద్రం కాళ్లను జగన్ పట్టుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అడగని ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు. రూ.లక్ష కోట్లు విలువైన అమరావతిని జగన్ ధ్వంసం చేశారన్నారు.
2022లో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. రానున్నది టీడీపీ ప్రభుత్వమన్న ఆయన.. ఇప్పుడు కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టిన వారికి భవిష్యత్తులో గుణపాఠం చెబుతామని హెచ్చరికలు చేశారు. బీసీలకు నష్టం వాటిల్లకుండా రిజర్వేషన్ పెడితే.. అందుకు భిన్నంగా జగన్ మాత్రం కుట్రపూరితంగా బీసీల్లో చీలిక తెచ్చారన్నారు.
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని జగన్ చెబుతున్నట్లుగా వ్యాఖ్యానించారు. మిగిలిన విషయాలన్ని రోటీన్ అన్న విషయం తెలిసిందే. జమిలి ఎన్నికలపై దేశంలోని మరే నేత మాట్లాడని బాబు.. అందుకు భిన్నంగా ఆయన ప్రస్తావించటం వెనుక అసలు కారణం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇంతకూ.. జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న విషయం బాబుకు ఎలా తెలిసిందన్నది ఇప్పుడు మరో ఆసక్తికర ప్రశ్నగా చెప్పక తప్పదు.