• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీఎం జగన్ వ‌ల్లే హత్యా...

సీఎం జగన్ వ‌ల్లే హత్యా రాజకీయాలు: చంద్రబాబు ఫైర్‌

By - Tupaki Desk
Update: 2022-07-19 08:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ఒక ఉన్మాది అని.. ఆయ‌న ప్రోత్సాహం వ‌ల్లే.. రాష్ట్రంలో హ‌త్యారాజ‌కీయాలు తెర‌మీదికి వ‌స్తున్నాయ‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి పై అలవల గ్రామంలో వైసీపీ రౌడీలు చేసిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు. మంగ‌ళ‌వారం ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడిచేశారంటే ఏపీలో శాంతిభద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయని నిల‌దీశారు.

రాష్ట్రంలో పోలీసులు  నిద్రపోతున్నారా? అని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేత ల హత్యలకు జగన్ రెడ్డి ప్రోత్సాహం ఉంది కాబట్టే వైసీపీ రౌడీలు ఇలా రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు.

పోలీసులను ఈ విషయంలో కల్పించుకోవద్దని జగన్ రెడ్డి ఆదేశాలిచ్చారా? లేకపోతే ఇలాంటివి జరుగుతుంటే వారెందుకు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారని విస్మ‌యం వ్య‌క్తం చేశారు.  

తెలుగుదేశం వైవు నుంచి కూడా ప్రతీకార చర్యలు ఉంటే వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? జగన్ తీసుకుంటారా? లేక పోలీసులా? అని చంద్ర‌బాబు గ‌ద్దించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకు ల మధ్య ఉన్న బాలాకోటిరెడ్డికి ఏం  జరిగినా దానికి జగన్ రెడ్డే సమాధానం చెప్పాలని అన్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

పల్నాడు జిల్లాలో మరో టీడీపీ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడి చేశారు. అలవలలో వాకింగ్‌కు వెళ్తున్న బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థుల దాడికి పాల్పడగా.. తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయనను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బాలకోటిరెడ్డిపై దాడిని టీడీపీ నేతలు ఖండించారు. హ‌త్యలు, దాడుల‌తో కేడ‌ర్‌ని భ‌య‌పెట్టాల‌నుకుం టున్న జ‌గ‌న్ రెడ్డికి శిశుపాలుడిలా పాపాలు పండిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రజావ్యతిరేక‌త తీవ్రం కావ‌డంతో, రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం చేయిస్తోన్న హ‌త్యలు, దాడులే వైసీపీ ప‌త‌నానికి దారులని మండిపడ్డారు. బాల‌కోటిరెడ్డికి ఏమైనా జ‌రిగితే జ‌గ‌న్‌ స‌ర్కారుదే బాధ్యత అని అన్నారు.
Tags:    
  • YSRCPGovernment 
  • YSJaganMohanReddy 
  • TDPParty 
  • APPolitics 
  • BalaKotiReddy 
  • PalnaduTDPLeaderAttack 
  • TDPLeader 
  • NaraLokesh 
  • Chandrababu 

Similar News

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS