అట్టర్ ప్లాప్ అయిన ‘రెండు కళ్ల’ మాటను మళ్లీ తెచ్చిన బాబు

Update: 2020-10-28 05:00 GMT
తీవ్రమైన విమర్శలే కాదు.. రాజకీయంగా భారీ డ్యామేజ్ చేసిన మాటల్ని.. వాడేందుకు రాజకీయ అధినేతలు ఇష్టపడరు. ఆ మాటకు వస్తే.. అలాంటి ప్రస్తావన రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబుు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం తెలుగు తమ్ముళ్లకు అస్సలు అర్థం కావట్లేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వేళ.. మిగిలిన నేతలకు భిన్నంగా రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చారు బాబు. అదే పనిగా రెండు కళ్ల సిద్ధాంతంతో.. విమర్శల పాలు కావటమే కాదు.. భారీస్థాయిలో ఎటకారాల్ని ఎదుర్కొన్నారు.

నిజానికి రెండు కళ్ల మాట బాబు స్థాయిని తగ్గించటమే కాదు.. ఆయన ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బ తీసింది. ఈ మాటతోనే.. తెలంగాణలో బలమైన పార్టీ కాస్తా.. ఈ రోజున ఉనికి కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి. అలాంటి రెండు కళ్ల మాటను మర్చిపోనట్లుగాన్నారు చంద్రబాబు. తాజాగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో మరోసారి.. రెండు కళ్ల ప్రస్తావనను తెర మీదకు తీసుకొచ్చారు.

రాజధాని అమరావతి.. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివని.. ఈ రెండు కళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పొడిచేసిందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనను దారుణంగా దెబ్బ తీసిన రెండు కళ్ల మాటను తాజాగా వాడటం వల్ల లాభం కంటే కూడా నష్టమే ఎక్కువంటున్నారు. ఎందుకంటే.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కారు మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకోవటం.. దీనిపై మద్దతు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అందుకు భిన్నమైన వాదనను బాబు వినిపించటం నష్టమే.

ఇక.. పోలవరం విషయంలోనూ  బాబు అభ్యంతరాలు అర్థం లేనివన్నది అధికారపక్ష నేతల మాటల వేళ.. పోలవరం ప్రస్తావనతీసుకురావటం అంటే.. తన లోపాల్ని తానే బయటపెట్టుకున్నట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన రెండుకళ్ల మాటను అదే పనిగా వివిధ అంశాల్లో వినియోగిస్తున్న చంద్రబాబు తీరుపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. బాబు నోటినుంచి వచ్చే రెండు కళ్ల మాటకు ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని.. ఈ మాటలు చెప్పి.. ఏపీని కష్టాల సుడిగుండంలోకి బాబు నెట్టారని.. మళ్లీ అదే మాటను ప్రస్తావించి.. ఇప్పుడేం చేయబోతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. కెలుక్కోవటంలో బాబుకు సాటి మరెవరూ రారేమో?
Tags:    

Similar News