రైల్వేల ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టత

Update: 2021-03-31 05:30 GMT
మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటుపరం చేసేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  క్రమక్రమంగా ఒక్కొక్కటి ప్రైవేటు చేతుల్లో పెట్టేలా ప్రభుత్వం వైఖరి ఉందనే ఆరోపణలున్నాయి.

ఇదే సమయంలో భారతీయ రైల్వేను కూడా ప్రైవేటుపరం చేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్రరైల్వే మంత్రి పీయూష్ గోయల్.. భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గోయల్ తాజాగా మాట్లాడారు. ‘రైల్వేలు జాతి సంపదన అని.. ప్రజల సంపదను ఎవరూ తాకలేరని వివరణ ఇచ్చారు.

రైల్వేల ప్రైవేటీకరణ ఎన్నటికీ జరగదన్న గోయల్.. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దని ప్రజలకు సూచించారు.

రైల్వే సేవలను మెరుగుపరిచేందుకు.. ప్రైవేటు పెట్టుబడులను స్వాగతించాలని చెప్పుకొచ్చారు. కానీ రైల్వే వ్యవస్థలో కొన్ని స్టేషన్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగిస్తామని.. తద్వారా మెరుగైన సేవలు అందించేలా చేస్తామని చెప్పారు.

అయితే దీన్ని ప్రైవేటీకరణ అనరా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బెంగాల్ లో ఇప్పుడు బీజేపీ చేస్తున్న ‘ప్రైవేటీకరణ’ణే పెద్ద ఇష్యూగా మారిపోయింది.
Tags:    

Similar News