పోలవరంకు కేంద్రం నిధులు.. రూ.2234 కోట్లు

Update: 2020-11-28 07:00 GMT
పోలవరంకు కేంద్రం నిధులు విడుదల చేసింది.  పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో కేంద్రం తరుఫున రీయింబర్స్ మెంట్ నిమిత్తం రూ.2234.28 కోట్లను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన నాబార్డ్ డీజీఎం వికాష్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ నిధులను జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ, పోలవరం ఆథారిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వానికి అందజేయనుంది. వచ్చే నెల మొదటి వారంలో ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ కానుంది.
 
పోలవరం తిప్పలు ఇప్పటివి కావు. దాదాపు బ్రిటిష్ కాలం నాటి నుంచే పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని యోచించారు. అయితే ఆ తరువాత వస్తున్న ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో దానికి కార్యరూపం దాల్చడం లేదు. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ను నిర్మించేందుకు ఒక రూపం తీసుకొచ్చారు. ఆ తరువాత చంద్రబాబు హయాంలో పోలవరంను నిర్మిస్తున్నామని చెప్పినా ప్రాజెక్టు పూర్తి కాలేదు.

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై సీరియస్ గా తీసుకొన్నారు. 2021 వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సాయం కావాలి. కానీ కేంద్రం మాటిమాటికి మెలికలు పెడుతుండడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడంలో లేదు.

ఇటీవల సీఎం జగన్ పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. కేంద్రమే దీన్ని భరించాలని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు లేఖ రాశారు. ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించి పోలవరానికి రూ.2234 కోట్లు విడుదల చేశారు.
Tags:    

Similar News