గుడ్ న్యూస్ .. 'మార‌టోరియం' పై కేంద్రం అఫిడ‌విట్

Update: 2020-10-03 09:30 GMT
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మరో గత్యంతరం లేక లాక్‌ డౌన్ ను కేంద్రం అమల్లోకి తీసుకువచ్చింది. ఇక లాక్ డౌన్ కారణంగా అందరి జీవన శైలి అస్తవ్యస్తం కావడంతో ఆ సమయంలో బ్యాంకు రుణాలపై కేంద్రం ఆరు నెలల పాటు మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రుణాల వడ్డీ పై వడ్డీని మాఫీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు శుక్రవారం వెల్లడించింది.  ఆరు నెల‌ల మార‌టోరియం కాలంలో రూ.2 కోట్ల వ‌ర‌కుగ‌ల రుణాల‌పై వ‌డ్డీ వ‌దులుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు ప్ర‌భుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో వ్యక్తిగత, చిన్న, మధ్యతరహా రుణగ్రహీతలకు పెద్ద ఉపశమనం కలగనుంది.

చిన్న రుణగ్రహీతలను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగించాలని, బ్యాంకు రుణాలపై వడ్డీ లేదా వాయిదాలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల కలిగే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అఫిడవిట్‌ లో తెలిపింది. ఎంఎస్ ఎం  ఈ లు, గృహ రుణాలు‌, విద్యా రుణాలు‌, వాహ‌న రుణాలు, క్రెడిట్ కార్డు బ‌కాయిల‌పై, వినియోగ‌దారు వ‌స్తువుల ఈఎంఐల‌పై వ‌డ్డీల‌ను మిన‌హాయించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం అఫిడ‌విట్ ద్వారా సుప్రీకోర్టుకు వివ‌రించింది. స‌మ‌స్య‌కు వ‌డ్డీ భారాన్ని భ‌రించ‌డ‌మే ఏకైక ప‌రిష్కార‌మ‌ని నిర్ణ‌యించిన‌ట్లు అఫిడ‌విట్ ‌లో తెలిపింది. అయితే అన్ని ర‌కాల రుణాల‌కు వ‌డ్డీని చెల్లించాలంటే రూ.6 ల‌క్ష‌ల కోట్లు భారం ప‌డుతుంద‌ని, అది చాలా అధిక‌మ‌ని, అందుకే రూ.2 కోట్లు ఆ లోపుగ‌ల రుణాల‌కే వ‌డ్డీ చెల్లించాల‌ని నిర్ణ‌యించామ‌ని కేంద్రం తెలిపింది.

 కాగా, క‌రోనా విస్త‌ర‌ణ నేప‌థ్యంలో రుణ గ్ర‌హీత‌ల‌కు వెసులుబాటు క‌లిగేలా  ఏప్రిల్‌ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఆరు నెల‌లపాటు కేంద్రం మార‌టోరియం విధించింది. అయితే, పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈ మొత్తానికి వడ్డీ వసూలు చేస్తున్నాయి. వడ్డీ సాధారణంగా ముందే నిర్ణయించడంతో రుణగ్రహీతలకు భారమవుతోంది.  ఈ నేప‌థ్యంలో విష‌యం కోర్టుకు చేర‌గా.. కోర్టు ఆదేశాల మేర‌కు తాజాగా కేంద్రం అఫిడ‌విట్ స‌మ‌ర్పించింది.     
Tags:    

Similar News