దొంగ ఓట్లకు ఆధార్ తో చెక్ చెప్పిన కేంద్రం

Update: 2021-12-16 11:36 GMT
నగరంలో ఒక ఓటు.. గ్రామంలో ఒక ఓటు.. అటు మున్సిపాలిటీలో ఓటు వేస్తారు.. ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తారు. అలా రెండు ఓట్లు వేసేస్తుంటారు. ఇక ఒక రాష్ట్రంలో మరో రాష్ట్రంలో ఎన్నికలున్నప్పుడు కూడా ఓటేసే ఘనులు ఉన్నారు.

ఎన్నికల సమయంలో దొంగ ఓట్లపై పెద్ద వివాదమే నడుస్తోంది. ఇటీవల తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి దొంగ ఓట్లు వేశారని ఆరోపణలున్నాయి. పార్టీలు ఫిర్యాదులు చేశాయి. దొంగ ఓట్లను నివారించేందుకు ఎన్నికల సంఘం ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.

దొంగ ఓట్లు వేసే వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను కనుక్కుంటూ దిగ్విజయంగా దొంగ ఓట్లను వేస్తూనే ఉంటున్నారు. దీనికి తాజాగా కేంద్రమంత్రివర్గం ముగింపు పలికింది. ఒక గొప్ప సంస్కరణకు నడుం బిగించింది. ఓటరు కార్డుతో ఆధార్ ను అనుసంధానించడం ద్వారా దొంగ ఓట్లకు ఇక చెక్ చెప్పింది.

ఓటరు కార్డుతో ఆధార్ ను అనుసంధానించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఈ విషయమై ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించలేదు. అలాంటిది బీజేపీ ప్రభుత్వం హఠాత్తుగా ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీనివల్ల దొంగ ఓట్లు వేసే అవకాశాలు తగ్గిపోతాయని అనుకుంటున్నారు.

ఆధార్ అనేది దేశంలో ఒక వ్యక్తికి ఒకే నంబర్. పోలింగ్ సమయంలో ఒక చోట ఓటు వేస్తే ఇక ఎక్కడా వేసే అవకాశం ఉండదు. దొంగ ఓట్లకు ఆస్కారం ఉండదు. ఓటరు కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించడం వల్ల ఓటరు ఒక చోట మాత్రమే ఓటు వేయగలరు. మరి ఇది సత్ఫలితాలు ఇస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News