హత్రాస్ కేసును సిబిఐ చేతికి..విచారణ షూరు

Update: 2020-10-11 11:30 GMT
యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా రూపొందిన 'రెడ్‌' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాలకు వరుసగా రామ్‌ ఓకే చెబుతున్నాడు. తాజాగా ఈయన సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ అనీల్‌ రావిపూడితో ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో రాజా ది గ్రేట్‌ సినిమాను మొదట రామ్‌ తోనే అనీల్‌ చేయాలనుకున్నాడు. అయితే ఆ సినిమా హీరో పాత్ర గుడ్డి వాడు అవ్వడం వల్ల తెలుగు ప్రేక్షకులు తనను అలా చూస్తారో లేదో అనే అనుమానంతో రామ్‌ ఆ సమయంలో ధైర్యం చేయలేక పోయాడు. రవితేజ ఆ సినిమా చేసి సక్సెస్‌ దక్కించుకున్నాడు.

ఆ సమయంలో అనీల్‌ రావిపూడికి నో చెప్పిన రామ్‌ మళ్లీ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన చర్చలు కూడా ఒక కొలిక్కి వచ్చాయట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనీల్‌ రావిపూడి ఇప్పటికే కమిట్‌ అయిన ఎఫ్‌ 3 మరియు సాయి పల్లవితో ఒక సినిమా తర్వాత రామ్‌ తో సినిమాను చేసే అవకాశం ఉంది అంటున్నారు.

రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత అనీల్‌ రావిపూడికి స్టార్‌ హీరోల ను డైరెక్ట్‌ చేసే అవకాశాలు వరుసగా వస్తాయి. కాని ఈ దర్శకుడు మాత్రం స్టార్‌ హీరోల వెనుక పరిగెత్తి కాలం వృదా చేసుకోకుండా తెలివిగా అందుబాటులో ఉన్న హీరోలతో సినిమాలు చేస్తూ తన సినిమాల సంఖ్యను పెంచేసుకుంటున్నాడు. రామ్‌ తో సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థం తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News