బ్రేకింగ్: శేఖర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ కోర్టు
ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్దనోట్లను రద్దు చేయగానే.. బడా బాబులు, వ్యాపారవేత్తలు దాచుకున్న నల్లడబ్బును తెల్లగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో కుప్పలు తెప్పలుగా పాతనోట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే..
అదే సమయంలో పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త టీటీడీ బోర్డు సభ్యులు శేఖర్ రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
గతంలో పాత నోట్లను రద్దు చేసిన సమయంలో నిబంధనలు అతిక్రమిస్తూ భారీగా పాతనోట్ల మార్పిడికి శేఖర్ రెడ్డి పాల్పడ్డారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. భారీగా ఆయన ఇంట్లో పాత నోట్లను పట్టుకున్నారు. వివిధ బ్యాంకుల ద్వారా భారీగా పాతనోట్ల మార్పిడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా 247.13 కోట్లు దారి మళ్లించారని ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ నమోదు చేశారు.
ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం.. సరైన ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలమైందని తెలిపింది. దీంతో ఈ కేసును మూసివేస్తున్నట్లు తెలిపింది. పాతనోట్లు నగదు చెలామణీ నేరంతో సీబీఐ నమోదుచేసిన రెండు కేసులను చెన్నై సీబీఐ కోర్టు కొట్టివేసింది. శేఖర్ రెడ్డితోపాటు ఇదే కేసులో ఉన్న మరో ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చింది.