కొత్త రూల్ః2ల‌క్ష‌ల వ‌ర‌కే న‌గ‌దు లావాదేవీలు

Update: 2017-03-21 17:15 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం నగదు రహిత లావాదేవీలపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. రూ. 3 లక్షల వరకు నగదు లావాదేవీలకు బడ్జెట్ లో ప్రతిపాదించిన కేంద్రం...ఆ పరిమితిని మరింత కుదించింది. రూ.2 లక్షల వరకే నగదు లావాదేవీలకు అనుమతినిస్తూ ఇవాళ లోక్ సభలో సవరణ ప్రతిపాదించింది. రూ.2 లక్షల కంటే మించిన లావాదేవీలను ఆన్ లైన్, చెక్కులు, డీడీల రూపంలోనే జరపాల్సి ఉంటుంది.దీనికితోడు, మరో రెండు సేవలకు ఆధార్ నంబర్ తప్పనిసరి చేసింది కేంద్రం. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు ఆధార్ నంబర్ తప్పకుండా ఉండాలని తేల్చిచెప్పింది. పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా ఆధార్ నంబర్ కావాల్సిందేనని స్పష్టం చేసింది.

ఇదిలాఉండ‌గా...పాత పెద్ద నోట్ల డిపాజిట్‌లపై దాఖలైన పిటిషన్‌ను ఈ రోజు సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ఆర్ఐల‌కు మాత్ర‌మే ఎందుకు అవ‌కాశం ఇచ్చారు. మార్చి 31 వ‌ర‌కు అంద‌రికీ ఎందుకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించింది. రెండు వారాల్లో దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
Tags:    

Similar News