పరిటాల రవి రెండో కుమారుడిపై కేసు నమోదు
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ కలకలం రేపింది. టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ బ్యాగులో 5.5 ఎంఎం బుల్లెట్ ఉన్నట్టుగా విమానాశ్రయ భద్రతా సిబ్బంది గుర్తించారు.ఈ ఘటన ఒక్కసారిగా ఎయిర్ పోర్టులో కలకలం రేపింది.
పరిటాల సిద్ధార్థ్ గురువారం శ్రీనగర్ కు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ ఎయిర్ పోర్ట్ అధికారులు.. స్క్రీనింగ్ సమయంలో అతడి బ్యాగులో బుల్లెట్ ఉన్నట్టు గుర్తించారని సమాచారం.
అయితే తన బ్యాగులో బుల్లెట్ ఉందని.. అందుకు అవసరమైన పత్రాలు లేవని తనకు తెలియదని సిద్ధార్థ చెప్పినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది వెంటనే సిద్ధార్థ్ బ్యాగులో పట్టుబడ్డ బుల్లెట్ ను ఆర్టీఐఏ పోలీసులకు అప్పగించారు. అనంతరం పరిటాల సిద్ధార్థ్ పై కేసు నమోదు చేశారు.
దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు పరిటాల సిద్ధార్థకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సూంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పరిటాల కుటుంబం ఇంతవరకు స్పందించలేదు. వివరణ రావాల్సి ఉంది.