నారా లోకేష్ పై కేసు నమోదు

Update: 2021-06-19 16:13 GMT
ప్రతిపక్ష నేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కు ఏపీ సర్కార్ షాకిచ్చింది. గతంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు తాజాగా కేసు నమోదు చేసింది.

టీడీపీ నేత నారాలోకేష్ పై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని లోకేష్, మరో నేత కొల్లు రవీంద్రపై విజయవాడలోని సూర్యారావుపేట పీఎస్ లో కేసు నమోదు చేశారు.

ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి సూర్యరావుపేట కోర్టు సెంటర్ కు లోకేష్, కొల్లు రవీంద్ర వెళ్లారు. ఆ సమయంలో కరోనా నిబంధనలు పట్టించుకోలేదంటూ ‘ఎపిడమిక్ యాక్ట్’ ప్రకారం కేసు నమోదు చేశారు. వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే నారా లోకేష్ పై అనంతపురం జిల్లా హిరేహాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డిపై నారా లోకేష్ ట్విట్టర్ లో చేసిన ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ లోకేష్ పై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తాజాగా మరోసారి లోకేష్ పై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News