• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మాజీ సీఎం కమల్ నాథ్ పై...

మాజీ సీఎం కమల్ నాథ్ పై కేసు నమోదు .. ఏమైందంటే ?

By - Tupaki Desk
Update: 2021-05-24 06:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి పై రాజకీయ వివాదానికి తెరలేపిన కాంగ్రెస్‌ టూల్‌ కిట్‌ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న, మొన్నటి వరకు  వరకు ట్విట్టర్ వేదికగా టూల్‌కిట్‌ విషయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న పార్టీలు ఇప్పుడు  కరోనా మ్యూటెంట్‌ పేరిట దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ట్విట్టర్‌ లేబుల్‌ తో ఈ గొడవ సమసిపోతుంది అనుకుంటున్న సమయంలో టూల్‌ కిట్‌ వివాదం మళ్లీ మొదటికొచ్చింది.  మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత కమల్‌ నాథ్‌ ఈ వైరస్‌ ని మొదట చైనా వైరస్‌ అన్నారు. ఇప్పుడు ఇండియన్‌ వేరియంట్‌ వంతు వచ్చింది. మన శాస్త్రవేత్తలు, డాక్టర్లు కూడా న్యూ స్ట్రెయిన్‌ ని ఇండియన్‌ వేరియంట్‌ అనే పిలుస్తున్నారు. కేవలం బీజేపీనే దీన్ని అంగీకరించడం లేదు. మన ప్రధానికయితే ఇండియన్‌ వేరియంట్‌ అంటేనే భయం పట్టుకుంది. అందుకే టూల్‌ కిట్‌ అంటూ అర్థం లేని విమర్శలు చేస్తున్నారు అని బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు మాజీ సీఎం కమల్‌ నాథ్‌. వైరస్‌ లు సర్వసాధారణంగా వెనువెంటనే వాటి రూపాన్ని మార్చుకుంటాయి. వాటినే స్ట్రెయిన్‌, మ్యూటెంట్‌ గా పిలుస్తారు. ఇండియాలో వచ్చిన కరోనా మ్యూటెంట్‌ కి సాంకేతికంగా బీ.1.167 గా గుర్తించారు. అయితే మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో దీన్ని ఇండియన్‌ వేరియంట్‌ గానే పేర్కొంటున్నాయి. అయితే , దీనిపై కేంద్రం మాత్రం గుర్రుగా ఉంది.

ఇక క‌మ‌ల్ నాథ్ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ తోసిపుచ్చింది. దేశ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేందుకు భార‌త్ వేరియంట్ అంటూ ప్ర‌చారం చేస్తున్న కాంగ్రెస్ టూల్ కిట్ లో భాగంగానే క‌మ‌ల్ నాథ్ వ్యాఖ్య‌లున్నాయ‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్తం మిశ్రా అన్నారు. అలాగే మాజీ సీఎం  కమల్ నాథ్ పై పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు భయపడేలా కామెంట్లు చేశారనే ఆరోపణలతో ఆయన పై కేసు నమోదైంది. భోపాల్ లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఉజ్జయినిలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇండియన్ వేరియంట్ అని కమల్ నాథ్ అన్నారు. దీనితో ఆయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005లోని సెక్షన్ 188, సెక్షన్ 54 కింద కేసు నమోదు చేశారు. కమల్ నాథ్ వ్యాఖ్యలు ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల్లో అయోమయాన్ని పెంచేలా ఉన్నాయని, దేశ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎఫ్ ఐ ఆర్ లో పోలీసులు పొందుపరిచారు.
Tags:    
  • former CM Kamal Nath 
  • Madhya Pradesh 
  • India 
  • Telugu News 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS