మాట తూలారు.. కేసులో బుక్కయ్యారు
తీవ్ర పదజాలంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విరుచుకుపడి.. సంచలనం సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చిక్కుల్లో పడ్డారు. బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకిస్తున్న ఆమె.. ఏపీ సర్కారు బాక్సైట్ తవ్వకాలు చేపడితే సంప్రదాయ ఆయుధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలను తెగనరుకుతామంటూ ఉద్వేగంతో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. గురువారం చింతపల్లిలో విపక్ష నేత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బాక్సైట్ వ్యతిరేక సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఈశ్వరి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈశ్వరి చేసిన వ్యాఖ్యలపై అధికారపక్షనేతలు మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలు సరికావంటూ తెలుగు దేశంలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. క.. పరుష పదజాలంతో ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన గిడ్డి ఈశ్వరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో 124 (ఎ).. 307.. 506.. 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.