వరదల్లో ఈ హైదరాబాదీ ఐడియా సూపర్ పో

Update: 2020-10-19 17:40 GMT
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటారు. భారీ వర్షాలతో అతలాకుతమైన హైదరాబాద్ లో వరదలో ఇంటి ముందు పార్క్ చేసి వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇప్పుడవన్నీ వాగులు, వంకలు, మురుగు కాల్వల్లో తేలుతున్నాయి. కార్లే కాదు.. బైకులు, భారీ వాహనాలైన లారీలు కూడా ఈ వరదలో కొట్టుకుపోయాయి. అయితే తాజాగా ఓ హైదరాబాద్ తన కారును కొట్టుకుపోకుండా చేసిన ఓ ఐడియా ఫలించింది. ఆ కారు భద్రంగా ఉంది. కొందరు సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు.

ఇప్పటికే ఒకసారి భారీ వర్షాలకు హైదరాబాద్ మునిగింది. దీంతో మరో మారు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తన గేటుకు కారును తాడుతో కట్టిపడేశాడు. దీంతో వరద కారు కింద నుంచి పారుతున్నా కారు మాత్రం ఇంచు కదలలేదు. ఎవరో దీన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

దీనిపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఒక తాడు, లేదా చైన్ ను ఇంటింటికి పంపిణీ చేయాలని కొందరు ఫన్నీ కౌంటర్లు ఇస్తున్నారు. మరికొందరు వాట్ ఎన్ ఐడియా సర్ జీ అంటూ కొనియాడుతున్నారు.
Tags:    

Similar News