కరోనా కారణంగా ఆ మాత్రలు దొరకలేదట!

Update: 2020-11-29 08:50 GMT
కరోనా లాక్ డౌన్ తో జనజీవనమే స్తంభించింది. మొత్తం ఈ ప్రపంచాన్ని ఇంట్లో కూర్చుండబెట్టింది. అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ధాటికి అన్ని రంగాలు కుదేలయ్యాయి. బయటకు వెళదామంటే జనం వణికిపోతున్నారు. కొద్దిరోజులుగా సెకండ్ వేవ్ తో మళ్లీ ఈ మాయరోగం కోరలు చాస్తోంది.

అయితే గతంలో కరోనా లాక్ డౌన్ వేళ జనం ఏం చేశారనే దానిపై ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. కరోనాను కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ కారణంగా ఫార్మసీ షాప్స్ మూసేయడంతో చాలా మందికి గర్భ నిరోధక మాత్రలు దొరకలేదట.. గర్భ నిరోధక మాత్రలు, కండోమ్స్ వంటివి దొరకకపోవడంతో చాలా మంది వాటిని ఉపయోగించలేదు.

దీంతో ఈ ఏడాది భారత్ లో జనాభా సంస్థ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గర్భ నిరోధక మాత్రలతోపాటు కండోమ్స్ కూడా దొరకకపోవడంతో ఎయిడ్స్ కేసులు కూడా పెరిగే ప్రమాదం ఉందని ఎయిడ్స్ నివేదిక హెచ్చరించింది. 2020-22లో మధ్యకాలంలో ఎయిడ్స్ కేసులు కూడా పెరుగుతాయని నివేదిక హెచ్చరించింది.

ఐక్యరాజ్యసమితి, యూని ఎయిడ్స్ నివేదిక ప్రకారం.. భారత్ లో సుమారు 2.5 కోట్ల జంటలు లాక్ డౌన్ కారణంగా గర్భ నిరోధక మాత్రలు వాడడం లేదట.. భారత్ తోపాటు మధ్య ఆదాయ, అల్పాదాయ దేశాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది. ఇవి జనాభా పెరుగుదలకు దారితీస్తాయని తేల్చి చెప్పింది.
Tags:    

Similar News