లోకేశ్ రిజైన్ త‌ప్ప‌దు!...బ‌రిలో గెలుస్తారా?

Update: 2019-02-16 07:20 GMT
మ‌రో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రగ‌నున్న నేప‌థ్యంలో... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు పార్టీతో పాటు త‌న సొంత కుమారుడిని కూడా ఇబ్బందుల్లో ప‌డేస్తున్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అస‌లు వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీకి ఏమాత్రం విజ‌యావ‌కాశాలు లేవ‌న్న మాట వినిపిస్తున్న నేప‌థ్యంలో బాబు త‌న‌దైన మంత్రాంగంతో త‌న కంటిని తానే పొడుచుకుంటున్నార‌న్న కోణంలోనూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ప్ర‌త్య‌క్ష బ‌రిలో దిగితే... గెలిచే ఛాన్సు త‌న కొడుక్కు లేద‌న్న భావ‌న‌తోనే రెండేళ్ల క్రితం ఏకంగా దొడ్డిదారిన చ‌ట్ట‌స‌భ‌ల్లోకి లోకేశ్ కు ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు.... ఇప్పుడు లోకేశ్ కు ప్ర‌త్య‌క్ష బ‌రిని అనివార్యంగా మార్చేశార‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి టీడీపీ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను భారీగానే మూట‌గ‌ట్టుకున్న నేప‌థ్యంలో లోకేశ్ ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగి విజ‌యం సాధిస్తారా? అన్న కోణంలోనూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింద‌ని చెప్పాలి.

ఇలాంటి అరుదైన ప‌రిస్థితి టీడీపీకి ఎలా వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ టికెట్ ఖ‌రారు కాగానే... మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి వ‌ర్గంతో కుదిరిన ఒప్పందం మేర‌కు మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డి త‌న ఎమ్మెల్సీ గిరీకి రాజీనామా చేసేశారు. తాజాగా నిన్న మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కూడా త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి పారేశారు. ఈ రెండింటికీ మండ‌లి చైర్మ‌న్ ఆమోద ముద్ర కూడా వేశారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే... ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయ‌క త‌ప్ప‌ద‌న్న సంకేతాల‌ను టీడీపీ త‌న నేత‌ల‌కు పంపిన‌ట్టైంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగి విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టిగానే బుద్ధి చెప్పాల‌ని లోకేశ్ భావిస్తున్నారు క‌దా. అందులో భాగంగా ఎక్క‌డైతే తాను సునాయ‌సంగా విజ‌యం సాధిస్తాన‌న్న విష‌యంపై ఆరా తీస్తున్న ఆయ‌న ఇప్ప‌టికే త‌న‌కు ఓ సేఫ్ జోన్‌ను కూడా ఖ‌రారు చేసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఆ సేఫ్ జోన్ ఏద‌న్న విష‌యంపై గుంభ‌నంగానే వ్య‌వ‌హ‌రిస్తున్న లోకేశ్... అసెంబ్లీ బ‌రికి సిద్ధ‌మైన‌ట్టుగానే పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో అసెంబ్లీకి పోటీ చేయాలంటే... ఎమ్మెల్సీ గిరీ రాజీనామా చేయాల్సిందే క‌దా. సోమిరెడ్డి, రామ‌సుబ్బారెడ్డిల మాదిరే ధైర్యం చూపాల్సిందే క‌దా. ఈ లెక్క‌న లోకేశ్ రాజీనామా చేయాల్సిందే క‌దా. మ‌రి లోకేశ్ చేత చంద్ర‌బాబు ఎమ్మెల్సీ గిరీ రాజీనామా చేయిస్తారా?  ఒక వేళ లోకేశ్ రాజీనామా చేస్తే.. మంత్రి పొంగూరు నారాయ‌ణ కూడా రాజీనామా చేయాల్సిందే క‌దా. ఇవ‌న్నీ జ‌రిగేనా? జ‌ర‌గ‌క త‌ప్ప‌దు క‌దా. తాను నిర్దేశించుకున్న వ్యూహాన్ని కొంద‌రికి మాత్ర‌మే వ‌ర్తింప‌జేస్తే... టీడీపీ జ‌నాల్లో ప‌లుచ‌న కావ‌డం ఖాయ‌మే క‌దా. మ‌రి లోకేశ్ తో పాటు నారాయ‌ణ కూడా త‌మ ఎమ్మెల్సీ ప‌ద‌వులకు రాజీనామా చేస్తారో?  లేదో?  చూడాలి. ఒక‌వేళ వీరిద్ద‌రూ రాజీనామాలు చేసినా... ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో వీరిద్ద‌రూ ఏ మేర‌కు గ‌ట్టెక్కుతారో కూడా చూడాలి.

Tags:    

Similar News