హైకోర్టుకే షాకిచ్చిన ‘కాగ్’

Update: 2020-11-28 08:30 GMT
రాజధాని అమరావతికి అయిన ఖర్చుల విషయంలో హైకోర్టుకే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పెద్ద షాకిచ్చింది. అమరావతికి ఇప్పటివరకు అయినా ఖర్చులు, నిర్మాణాలను నిలిపేయటం వల్ల జరిగిన నష్టం వివరాలు ఇవ్వాలని కోర్టు కాగ్ ను ఆదేశించింది. అయితే ఖర్చులు, నష్టాల అంచానాలను కోర్టుకు సమర్పించటం సాధ్యం కాదని కాగ్ స్పష్టంగా  బదులిచ్చింది. రాజ్యాంగం ప్రకారం తమ నివేదికలను రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతికి మాత్రమే ఇస్తామని చెప్పింది. వీళ్ళ పరిశీలన తర్వాత చట్టసభల్లో ప్రవేశపెడతారన్న విషయాన్ని గుర్తుచేసింది. కాబట్టి ఖర్చులు - నష్టాల అంచనాలను తాము కోర్టుకు ఇవ్వలేమని స్పష్టంగా చెప్పేసింది.

అమరావతి విషయంలో ఇప్పటి వరకు అయిన ఖర్చులను - నిర్మాణాలను ఆపేయటం వల్ల జరిగే నష్టాలను తెలుసుకోవాలని  హైకోర్టు అనుకున్నది. ఖర్చులు - నష్టాల విషయంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో భాగంగానే కోర్టు కాగ్ ను ఆదేశించింది. అయితే కాగ్ నుండి ఇటువంటి సమాధానం వస్తుందని బహుశా హైకోర్టు ఊహించుండదేమో. అకౌంటెంట్ జనరల్ తరపున రాష్ట్ర అకౌంటెంట్ డిప్యుటి జనరల్ ఆదిత్య ఆర్ భోజదియా కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు.

తన అఫిడవిట్ లో రాజ్యాంగం ప్రకారం కాగ్ స్వంతంత్ర సంస్ధ అన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ సంస్ధ ఆడిట్ చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలను, నివేదికలను తమ నిబంధనల ప్రకారం  ఆయా ప్రభుత్వాలకు మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు. వీటికి తప్ప కోర్టులకో ఇతర సంస్ధలకో అందించే అవకాశం లేదని కూడా స్పష్టంగా చెప్పేశారు. పైగా తమకు ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారమే తాము ఆడిట్ చేస్తామని కూడా గుర్తు చేసింది. కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తమను ప్రతివాదా మారుస్తు కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కూడా కోరారు.

భరద్వాజ్ తాజాగా అందించిన సమాధానం పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది. ఇంతకాలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ల విచారణలో హైకోర్టు రాజ్యాంగాన్ని పదే పదే ప్రస్తావిస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు కాగ్ కూడా అదే రాజ్యాంగాన్ని ఉదాహరణగా చెప్పి లెక్కలు, నష్టాలు ఇవ్వటం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. మరి కోర్టు ఏమంటుందో చూద్దాం.
Tags:    

Similar News