• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీ ఓటరు సర్వే: ఏపీలో ఇది...

సీ ఓటరు సర్వే: ఏపీలో ఇది నమ్మొచ్చా..?

By - Tupaki Desk
Update: 2019-03-11 05:02 GMT
జాతీయ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రావడమే తరువాయి జాతీయ మీడియా సంస్థలు సర్వేలతో హడావుడి చేస్తున్నాయి. అప్పుడే పార్టీలకు వచ్చే స్థానాల సంఖ్యలను తెలుపుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. వీటిలో సీ ఓటర్‌ సర్వే ఒకటి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన గంటకే తన అభిప్రాయాన్ని తెలిపింది. వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి ఎక్కువ లోక్‌సభ స్థానాలు వస్తాయని - రెండో స్థానంలో వైసీపీ ఉంటుందని తెలిపింది. అయితే ఈ సీ ఓటర్‌ సర్వే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహించిన సర్వేకు ఫలితాలు వెల్లడించిన తరువాత వచ్చిన రిజల్ట్స్ కు ఎక్కడా పోలిక లేకపోవడం గమనార్హం.

తాజాగా సీ ఓటర్‌ నిర్వహించిన సర్వే వివరాలు ప్రకటించింది. దీని ప్రకారం టీడీపీకి 14 లోక్‌ సభ స్థానాలు - వైసీపీకి 11 వస్తాయని తెలిపింది. కేవలం రెండు శాతం మాత్రమే తేడాతో పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుంటాయని పేర్కొంది. ఇదే సీ ఓటర్‌ గత డిసెంబర్‌ లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో భాగంగా నవంబర్‌ 9న సర్వేను బయటపెట్టింది. టీడీపీ - కాంగ్రెస్‌ కలిసి ఏర్పరిచిన మహాకూటమి అధికారంలోకి రానుందని పేర్కొంది. మహాకూటమి 64 స్థానాల్లో విజయం సాధిస్తుంది. టీఆర్‌ ఎస్‌ కు 42 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని పేర్కొంది.

అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 80 స్థానాలకు పైగా గెలుచుకొని అధికారాన్ని కూడా చేపట్టింది. అలాగే మహాకూటమి సీ ఓటర్‌ సర్వేలో పేర్కొన్న వాటిలో సగం స్థానాలు కూడా రాబట్టలేకపోయాయి. దీంతో ఇలాంటి సంస్థ ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ గెలుస్తుందని చెప్పింది. ఈ సంస్థలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ నాయకులు సూచిస్తున్నారు. ఇక కొన్ని మీడియా సంస్థల్లో వైసీపీ అఖండ విజయం సాధిస్తుందని పేర్కొంటున్నారు. అలాగే లోక్‌ సభలోనూ వైసీపీ కీలకంగా మారుతుందని తెలుపుతున్నాయి. టీడీపీ కంటే ఈసారి జనసేనను ఎక్కువగా ఆదరిస్తాయని అవి ప్రకటించిన వాటిలో ఉన్నాయి.

ఏదేమైనా ఓటర్ల నాడి పూర్తిగా పట్టడం కష్టమని తెలంగాణ ఎన్నికల్లో సర్వే చేసి బొక్కాబోర్ల పడ్డాక లగడపాటి పేర్కొన్న సంగతి తెలిసిందే. సర్వేలు కేవలం నామమాత్రంగానే ప్రకటిస్తారని.. వీటిలో కొన్ని మాత్రమే నిజమవుతాయని అంటున్నారు. అందువల్ల ప్రజలు సర్వేలను కాకుండా  ఏ ప్రభుత్వం తమకు మంచి చేస్తుందో నిర్ణయించుకొని ఓటేయ్యాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.


Tags:    
  • C Voter Survey 
  • Assembly 
  • Lok Sabha Elections 
  • Andhra 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS