• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుకు అమరావతి దెయ్యం...

బాబుకు అమరావతి దెయ్యం పట్టిందా?

By - Tupaki Desk
Update: 2016-02-22 06:52 GMT
రాజకీయాల్లో కొన్ని అంశాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఒకప్పుడు చంద్రబాబుకు ఎవరైతే అండగా ఉండి..  పార్టీ కోసం తమ ప్రాణాలు అయినా ఇచ్చేస్తామని ప్రకటించారో.. అలాంటి వారిలో కొందరు బాబు మీద చేసే వ్యాఖ్యలు.. విమర్శలు చూస్తే ఆసక్తికరంగా ఉంటాయి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించి.. బాబుకు చాలా క్లోజ్ అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాతి కాలంలో పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. జై రాయలసీమ నినాదంతో గత కొద్దికాలంగా తన వాదనను వినిపిస్తున్నారు.

అయితే.. ఆ మధ్యన ఆయనపై హత్య కేసు నమోదు కావడం .. అండర్ గ్రౌండ్ కి వెళ్లటంతో ఆయన వాయిస్ పెద్దగా వినిపించలేదు. ఇప్పుడిప్పుడే ఆయన మళ్లీ తన గళం విప్పుతున్నారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న ఆయన.. జై రాయలసీమ అంటూ నినదిస్తూ ఉద్యమించటానికి సిద్ధమయ్యారు. తాజాగా కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర షురూ చేసి ఆయన.. బాబు మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

జై తెలంగాణ అంటూ తెలంగాణ వాసులు తమ రాష్ట్రాన్నిసాధించారని.. అదే తీరులో జై రాయలసీమ అన్న నినాదంతో సీమ ప్రజలు ముందుకు వెళ్లాలంటున్న బైరెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి దెయ్యం పట్టుకుందని వ్యాఖ్యానించారు. సీమ వాసులంతా కలిసి దెయ్యం వదిలిద్దామన్నారు. పవర్ లోకి వచ్చి రెండేళ్లు అయినా.. రాయలసీమకు ఆయన చేసిందేమీ లేదన్న బైరెడ్డి.. ఉపాధి లేక సీమ వాసులు పెద్ద ఎత్తున వలసలు వెళుతున్నారని వ్యాఖ్యానించారు.

రానున్న రోజుల్లో సీమ ప్రజల పౌరుషం ఏమిటో చూపిస్తామంటూ హెచ్చరిస్తున్న ఆయన... కోస్తాలోని 123 సీట్ల కోసం సీమను నిర్లక్ష్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీమ సంపదను తీసుకెళ్లి అక్కడ ఖర్చు చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఒక విభజనతో కిందామీదా పడుతున్న సీమాంధ్రకు మరో విభజన స్వరం అవసరమా? అన్నది ఒక ప్రశ్న అయితే.. సీమ వాసుల విషయంలో చంద్రబాబు మరింత దృష్టి పెట్టటం ద్వారా.. ఇలాంటి అసంతృప్తి గొంతులకు అభివృద్ధితో సమాధానం చెప్పాలని కోరుతున్నారు.
Tags:    
  • Byreddy Rajasekhar Reddy 
  • Chandrababu naidu 
  • Telugu NEws 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS