మూతి పగులగొడతా..జర్నలిస్టు పై బ్రెజిల్ అధ్యక్షుడి నోటి దురుసు!
బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో..ఈయన కోరి వివాదాలను కొని తెచ్చుకోవడంలో మంచి దిట్ట. గోరు తో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అనే సామెత ఈయనగారి సరిగ్గా సూట్ అవుతుంది. నిత్యం ఎదో క గొడవ తో వార్తల్లోకి ఎక్కే ఈయన .. తాజాగా ఏకంగా జర్నలిస్ట్ పైనే చిందులు తొక్కి వార్తల్లోకి ఎక్కారు. కోపంతో ఊగిపోతూ తన నోటికి పని చెప్పాడు. మూతి పగలగొడతా అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. కేథడ్రాల్ పర్యటన సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించడం విమర్శలకు దారి తీసింది. వెంటనే అయన మాటలకి తోటి జర్నలిస్టలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కూడా వాటిని ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం. ప్రశ్న అడిగినందుకు జర్నలిస్టుపై ఇలా నోటి దురుసు మాటలు ఏంటని పలువురు మండిపడుతున్నారు.
పర్యటనకు వెళ్లిన అధ్యక్షుడు బోల్సొనారో మీడియాతో పలు అంశాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ అధ్యక్షుడి భార్య మిచెల్లి బోల్సోనారోపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించారు. ఆ వెంటనే కోపంతో ఊగిపోతూ.. మూతి పగలగొడతా అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు పలువురిని ఆగ్రహానికి గురి చేశాయి. కాగా 2019 జనవరిలో జైర్ బోల్సోనారో అధ్యక్షుడయ్యే ముందు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనీ కొంత కాలంగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై అక్కడ విచారణ సంస్థలు దర్యాప్తు కూడా చేస్తున్నాయి. జైర్ బోల్సొనారో బెదిరింపులపై పత్రిక స్పందించింది. ఒక ప్రభుత్వ నేతగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఆయన తన కర్యవ్యాన్ని విస్మరించారని విమర్శించింది. వృత్తిపరంగా తన విధిని నిర్వర్తించారంటూ భాధిత జర్నలిస్టు, తమ ఉద్యోగికి మద్దతుగా నిలిచింది.