హైద‌రాబాద్ మేయ‌ర్ ఆ ముచ్చట తీరిపోయింది

Update: 2016-02-11 07:19 GMT
ట‌ర్ హైదరాబాద్ నగర మేయర్‌ గా టీఆర్ ఎస్ అభ్య‌ర్థిని సీట్లో కూర్చొబెట్టాల‌న్న టీఆర్ ఎస్ పార్టీ క‌ల నెర‌వేరింది. జీహెచ్ ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా కార్పొరోటర్ల ప్ర‌మాణ‌స్వీకారంతో పాటు మేయ‌ర్ ఎంపిక పూర్త‌యింది. జీహెచ్‌ ఎంసీ కమిటీ హాల్‌ లో జరిగిన సమావేశంలో కొత్త కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక చేపట్టారు.

మేయర్‌ గా బొంతు రామ్మోహన్ పేరును కార్పొరేటర్ మన్నె కవిత ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదనను మీర్‌ పేట్ కార్పొరేటర్ అంజయ్య బలపరిచారు. వేరే పేర్లు ప్రతిపాదనకు రాకపోవడంతో రామ్మోహన్ మేయర్‌ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ గా బాబా ఫసియుద్దీన్ పేరును అమీర్‌ పేట కార్పొరేటర్ శేషు కుమారి ప్రతిపాదించారు. రాంనగర్ టీఆర్ ఎస్‌ కార్పొరేటర్ శ్రీనివాస్‌ రెడ్డి బలపరిచారు. డిప్యూటీ మేయర్‌ గా మరో పేరు ప్రతిపాదనకు రాకపోవడంతో ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇరువురికి ఎంఐఎం కూడా మద్దతు తెలిపింది.
Tags:    

Similar News