హీరోయిన్ తో బొండా ఉమా.. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు
సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. మార్ఫింగ్ ఫొటోలను పెట్టి కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బొండా ఉమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలతో ప్రజల్లో తనపై లేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీని.. అందజేస్తున్న ఫొటోను బొండా ఉమ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘తప్పుడు ఆరోపణలు చేయడం కాదురా జఫ్ఫా పేటీయం బ్యాచ్.. దమ్మున్నోడిలా పోలీసులకు ఫిర్యాదు చేశా.. మీ నాయకుడి అభిమాన జైలు అయిన చంచల్ గూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. మేనేజ్ చేయడానికి ఏపీ పోలీసులు కాదు..’ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
తాను ప్రముఖ హోటల్ నుంచి హీరోయిన్ తో బయటకు వస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టింగ్స్ తో ప్రత్యర్థులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని బొండా ఉమా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ హీరోయిన్ ఎవరో కూడా తనకు తెలియదని.. ఆమెతో ఎటువంటి సంబంధం లేదని బొండా ఉమా స్పష్టం చేశారు.