లవర్ ప్రైవేట్ వీడియోస్ తో బ్లాక్ మెయిల్ ... ఏకంగా 10 మందిని ..

Update: 2021-02-19 16:30 GMT
ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో మోసం చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. మొదట్లో ప్రేమనించినట్టు నటించి , ఆ తర్వాత వారి నిజ స్వరూపాలు బయటకి తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఓ కాలేజ్ అమ్మాయి ని ప్రేమించినట్టు నటించి , ఫుల్ గా ఎంజాయ్ చేసి, ప్రేమ మత్తులో ఉండగానే ఆ అమ్మాయి తో బాత్ రూమ్, బెడ్ రూమ్ వీడియోలు తెప్పించుకొని, చివరికి ఆ వీడియోలని అడ్డుపెట్టుకొని అడ్డం పెట్టుకుని లవర్ తో పాటు ఆమె తండ్రిని బ్లాక్ మెయిల్ చేశాడు. పోలీసుల ఎంట్రీతో  ప్రియురాలి కంటే అంతకు ముందే 10 మంది అమ్మాయిలు, ఆంటీల జీవితాలతో గేమ్స్ ఆడాడని వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే .. చెన్నైలోని కారుకుప్పం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ చదువుతోంది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న సమయంలో ఆ అమ్మాయికి కార్తీక్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కార్తీక్ మాత్రం చదువుకోవడం లేదు. ఓ హోటల్ లో కుక్ గా  పనిచేస్తున్నాడు. కాలేజ్ అమ్మాయిని లొంగదీసుకున్న కార్తీక్ ఆమెను నమ్మించి అనేక ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు.  ఇదే సమయంలో ప్రియురాలి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉన్నాయని కార్తీక్ కు తెలిసింది. కాలేజ్ అమ్మాయి గుడ్డిగా కార్తీక్ ను నమ్మింది. మంచిరోజు చూసిన కార్తీక్ ప్రియురాలికి ఫోన్ చేశాడు. నువ్వు బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో వీడియో తీసి తనకు వాట్సాప్ లో పంపించాలని, నువ్వు స్నానం చేస్తున్న సమయంలో, బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఎలా ఉంటావో చూడాలని తనకు ఆశగా ఉందని కార్తీక్ ప్రియురాలికి మాయ మాటలు చెప్పాడు.

ప్రియుడి కోరికలు ఇప్పటికే తీరుస్తున్నానని, ఇక బాత్ రూమ్ స్నానం వీడియో, బెడ్ రూమ్ వీడియో తీసి పంపిస్తే పోయిది ఏముందని  ఆలోచించి,  బెడ్ రూమ్ లో పర్సనల్ గా ఉన్న సమయంలో వీడియో తీసిన కాలేజ్ అమ్మాయి ప్రియుడు కార్తీక్ కు పంపించింది. ఇదిలా ఉండగానే ఆ అమ్మాయికి ఇటీవలే వేరే వ్యక్తితో పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 తన ప్రియురాలికి పెళ్లి అయిపోతే మనం ఏం చెయ్యాలని అలోచించి , ఏదైనా చెయ్యాలని కార్తీక్ అతితెలివితో  ప్రియురాలికి ఆమె నగ్న వీడియోలు పంపించిన కార్తీక్ భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేదంటే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే ఆ అమ్మాయి డబ్బు ఇవ్వను అని చెప్పడంతో ఆమె తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి కూతురి నగ్న వీడియోలు పంపించాడు.

కుమార్తె బాత్ రూమ్ వీడియోలు చూసిన తండ్రి షాక్ అయ్యి చెన్నై పోలీసులకు విషయం చెప్పడంతో కార్తీక్ మీద కేసు నమోదైయ్యింది. పోలీసులు కార్తీక్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. కాలేజ్ అమ్మాయి కంటే ముందే కిలాడీ కార్తీక్ గాడు మరో 10 మంది అమ్మాయిలు, ఆంటీలను ఇలాగే నమ్మించి లొంగదీసుకుని వాళ్ల నగ్న వీడియోలు సంపాధించి బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దీనితో కార్తీక్ బెండు తీసి పోలీసులు ఇంకా ఎన్ని ఘోరాలు చేశాడో వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Tags:    

Similar News