కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ..కీలక పదవుల్లో డీకే అరుణ - పురందేశ్వరి!

Update: 2020-09-26 16:00 GMT
కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. జేపీ నడ్డా అధ్యక్షుడయిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. 12 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు, 23 మంది అధికార ప్రతినిధులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 23 మంది అధికార ప్రతినిధుల్ని నియమించినప్పటికీ.. జీవీఎల్ నరసింహారావుకు మాత్రం చోటు దక్కలేదు

ఇందులో తెలుగువారికి కీలక పదవు ఇచ్చింది. తెలుగురాష్ట్రాలకు చెందిన డీకే అరుణ, పురందేశ్వరిలకు జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. దగ్గుబాటి పురందేశ్వరికి కూడా తాజా కార్యవర్గంలో సముచిత స్థానం లభించింది. ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఏపీకి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు. మొత్తంగా కార్యవర్గంలో ఏపీ నుంచి ఇద్దరికి..తెలంగాణ ఇద్దరికి చోటు లభించింది. ఇక , జీవీఎల్ నరసింహారావు, రామ్‌మాధవ్, మురళీధర్ రావులను పార్టీ పదవుల నుంచి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలగించారు. జివిఎల్ సంగతి పక్కన పెడితే .. రామ్‌మాధవ్, మురళీధర్ రావులకు ప్రమోషన్ ఇవ్వడానికి పార్టీ బాధ్యతల నుంచి తప్పించారా ,లేక పక్కన పెట్టడానికి చేశారా అన్నది త్వరలో వెల్లడికాబోతుంది.
Tags:    

Similar News