ఆన్​లైన్​ రమ్మీతో పిల్లలు ఆగం.. నిషేధం పెట్టండి

Update: 2020-09-16 07:50 GMT
ఆన్ ​లైన్​ రమ్మీని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలని.. ఈ ఆటతో చదువుకొనే పిల్లలు నాశనమవుతున్నారని బీజేపీ ఎంపీ కేసీ రామ్మూర్తి కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.  చాలా మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఈ ఆటకు బానిసలయ్యారని చెప్పారు. దేశానికి వెన్నెముక లాంటి యువత రమ్మీ ఆటతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నది చెప్పారు. మంగళవారం రామ్మూర్తి రాజ్యసభ లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ రమ్మీ ఆటతో యువత తెలివితేటలు పెరుగవు. అది జూద క్రీడ. జూదం ఎంతో ప్రమాదకరమని పురాణాలు మనకు చెబుతున్నాయి. ధర్మరాజు లాంటి వ్యక్తే జూదమాడి సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ మాయదారి ఆటతో ఎంతో మంది తమ ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఇది ప్రస్తుతం స్మార్ట్​ ఫోన్​ లు ఉన్న ప్రతి వారిని ఆకర్షిస్తుస్తోంది. కాలక్షేప ఆటగా ప్రారంభమై ముందు రూ.1, రూ. 10 నుంచి ప్రారంభం అవుతుంది. చివరకు మన ఆస్తులన్నీ గుల్ల చేస్తుంది.

 సినీ హీరోయిన్లు ఈ గేమ్​షో లకు ప్రచారం కల్పిస్తున్నారు. దీంతో యువత ఈ షోకు బానిస గా మారుతోంది. సినిమా వాళ్లు ఈ ఆన్​ లైన్​ రమ్మీ యాడ్స్​ లో పాల్గొనకుండా నిషేధం విధించాలి.  ఈ ఆన్​ లైన్​ మనీ గేమింగ్​ దందా మన దేశంలో రూ.2,200 కోట్ల సామ్రాజ్యంగా విస్తరించిదని కేజీఎం నివేదిక అంచనా వేసింది.  ఇలాగే కొనసాగితే ఈ రమ్మీ వ్యాపారం 2023 నాటికి రూ.12వేల కోట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.’ అని ఎంపీ అభిప్రాయపడ్డారు. దీన్ని వెంటనే కేంద్రం నిషేధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News