ఏపీలో బీజేపీ ఎంపీ అభ్యర్థి లిక్కర్ బిజినెస్.. అరెస్ట్

Update: 2020-08-17 04:45 GMT
ఏపీలో ఇప్పుడు మద్యమే అసలు బిజినెస్ అయ్యింది. ఆంధ్రాలో జగన్ సర్కార్ మద్యనిషేధం దిశగా లిక్కర్ ధరలను భారీగా పెంచేసింది. డబుల్ రేట్ ఉంది. దీంతో తెలంగాణ సహా పక్కరాష్ట్రాల నుంచి ఏపీకి చీప్ మద్యం ఏరులై పారుతోంది. చోటా మోటా నేతలందరికీ ఇప్పుడు ఇదే బిజినెస్ గా మారింది. కాసులు కురిపిస్తోంది.

తాజాగా తెలంగాణలోని చిట్యాల  నుంచి ఏపీలోని గుంటూరుకు అక్రమంగా మద్యం తరలిస్తూ బీజేపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి గుడివాక రామాంజనేయులు పోలీసులకు చిక్కారు. ఈయన గత 2019 లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు.

కాగా ఆదివారం ఈ అక్రమ మద్యం తరలించిన కేసులో అంజిబాబును ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాక రామాంజనేయులతోపాటు మచ్చా సురేష్, కే నరేశ్, గంటా హరీష్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 1920 మద్యం సీసాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

కాగా మద్యం రవాణా అక్రమంగా చేస్తూ, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిన రామంజనేయులు గుడివాక (అంజిబాబు)ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు పార్టీ నుండి  సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులో బీజేపీ సభ్యులెవరూ ఇలాంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటం పార్టీ సహించదని ప్రకటించడం విశేషం.
Tags:    

Similar News