కుప్పకూలడానికి రెడీగా బీజేపీ సర్కార్?
బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై సొంత కూటమిలోనే అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీని వ్యతిరేకించగా.. తాజాగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న మిత్రపక్షం ‘శిరోమణి ఆకాలీదళ్’ కూడా బీజేపీకి షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం ‘శిరోమణి అకాలీదళ్’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. అంతేకాదు.. బీజేపీలో కేంద్రమంత్రిగా ఉన్న శిరోమణి అకాలీదల్ ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ తాజాగా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడు అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు కూడా నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలో బీజేపీప్రభుత్వంలో భాగస్వామ్యపక్షంగా ఉన్న ‘జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)’ ఎన్డీఏ నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జేజేపీ చీఫ్ దుశ్యంత్ సింగ్ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వం నుంచి వైదొలిగితే బోటాబోటా మెజార్టీతో ఉన్న హర్యానా సర్కార్ కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని.. తాము ఇక ప్రభుత్వంలో కొనసాగలేమని అకాలీదళ్ వైదొలగిన నేపథ్యంలో చౌతాలా మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది.
రైతుల పక్షపాతిగా ఉన్న చౌతాలా కుటుంబం రైతులకు అండగా ఉండేందుకు బీజేపీ వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలని.. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి వైదొలగాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
90 స్థానాలున్న హర్యానాలో ఖట్టర్ సీఎంగా ఉన్నారు. బీజేపీ 40 స్థానాలు సాధించింది. జేజేపీ 10 స్థానాలు గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో చౌతాలా వైదొలిగితే హర్యానాలో సర్కార్ కుప్పకూలుతుంది.