మొత్తం 876 కోట్ల విరాళాలు.. బీజేపీకే 698 కోట్లు

Update: 2020-10-16 09:45 GMT
ఒక రాజకీయ పార్టీ నడవాలంటే దానికి విరాళాలు తప్పనిసరి. ముఖ్యంగా దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్లు, బిజినెస్ మ్యాన్లు, వివిధ సంస్థలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. ఇక టికెట్లు తీసుకునే నేతలు ఎంతో కొంత పార్టీ అధిష్టానానికి విరాళాలుగా ఇచ్చి ఆ సీట్లు కొల్లగొడుతారు. ఇది అనాదిగా జరుగుతున్న ప్రక్రియే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి కోట్లకు కోట్లు విరాళాలు వస్తుంటాయి. ప్రభుత్వాలతో పని ఉండే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు.. సీట్లు ఆశించే ఆశావహులు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తుంటారు.

ఇందులో అధికారంలో ఉన్న పార్టీలకే ఆదాయం వస్తుంటుంది. ప్రభుత్వం కొనసాగిస్తుండడంతో వారి ద్వారా ఏదైనా లబ్ధి చేకూరుతుందని పారిశ్రామికవర్గాలు, బడా బాబులు, రాజకీయ నేతలు పార్టీలు మొగ్గుచూపుతుంటాయి.  ఇప్పుడు కేంద్రంలోని బీజేపీకి , ప్రతిపక్ష కాంగ్రెస్ లకు విరాళాలు అందాయి.  2018-19 ఎన్నికల సంవత్సరంలో వచ్చిన విరాళాల మొత్తాన్ని తాజాగా ‘పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్)’ గురువారం వెల్లడించింది.
 
దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు మొత్తం రూ.876 కోట్లు విరాళంగా అందగా.. అందులో బీజేపీకే పెద్ద ఎత్తున విరాళాలు అందాయి. ఆ తర్వాత కాంగ్రెస్ కు అందాయి. ఇందులో బీజేపీకే రూ.698 కోట్లు రాగా.. రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ 122.5 కోట్ల డొనేషన్ దక్కించుకుందని రిపోర్టులు చెబుతున్నాయి. మొత్తం విరాళాల్లో దాదాపు 92శాతం బీజేపీకే వచ్చాయని ఏడీఆర్ తెలిపింది.

ఇక జాతీయ పార్టీల్లో బీజేపీ కాంగ్రెస్ తర్వాత ఎన్సీపీకి అత్యధిక విరాళం అందాయి. ఆ పార్టీకి 11.34 కోట్లు విరాళంగా అందాయి.

బీజేపీకి 1573మంది కార్పొరేట్ దిగ్గజాలు విరాళాలు ఇవ్వగా.. కాంగ్రెస్ కు 122మంది కార్పొరేట్స్ విరాళాలు ఇచ్చారు.

ఇక కొంతమంది పాన్ కార్డులు, అడ్రస్ డీటైల్స్ ఇవ్వకుండా విరాళాలు అందించారు.. ఇవి 13.36 కోట్లు జాతీయ పార్టీలకు అందాయి.
Tags:    

Similar News