బీజేపీకి మైలేజీ రాలేదే? రీజ‌నేంటి?

Update: 2022-01-23 15:32 GMT
రాష్ట్రంలో పుంజుకుందామ‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న బీజేపీకి ఆశించినంత మైలేజీ రావ‌డం లేదు. అనుకున్న విధంగా పార్టీ పుంజుకోవ‌డం లేదు. నిజానికి నెల‌కో స‌భ పెట్టి.. పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని సోము వీర్రాజు స‌హా కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నాలు  చేస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట గుంటూరులో స‌భ పెట్టారు. దీనికి ఫ‌ర్వాలేదు.. అనే టాక్ వ‌చ్చింది. దీనికి కేంద్ర మాజీ మంత్రి ప్ర‌కాశ్ జావ‌దేక‌ర్ వ‌చ్చి.. సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బాగానే మీడియా క‌వ‌ర్ చేసింది. ఇది అనుకున్న విధంగానే స‌క్సెస్ అయింది. ఇక‌, అమ‌రావ‌తి రాజ‌ధానికి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు ప్ర‌క‌టించారు.

ఇది బాగానే వ‌ర్కువుట్ అయింది. అయితే.. కేంద్రం వైఖ‌రి చెప్పాల‌ని రైతులు నిల‌దీసే స‌రికి రాష్ట్ర నేత‌లు సైలెంట్ అయ్యారు. ఎందుకంటే.. రాష్ట్ర ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులు అంటోంది. దీనికి కేంద్రం సైలెంట్‌గా ఉంది. పైగా రాజ‌ధాని ఇష్యూ త‌మ ప‌రిదిలో లేద‌ని చెబుతోంది. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తికి బీజేపీ మ‌ద్ద‌తిచ్చినా.. రాష్ట్ర ప్ర‌బుత్వం తీసుకున్న నిర్ణ‌యం త‌ప్ప‌ని చెప్ప‌డంలోనూ.. దీనిని నిర్ద్వంద్వంగా ఖండించడంలోనూ. .కేంద్రం చొర‌వ చూప‌డం లేదు. దీంతో ఈ విష‌యంలో ఆశించిన మైలేజీ ల‌భించ‌డం లేదు. ఇదిలావుంటే.. నెల‌కొ స‌భ పేరిట తాజాగా క‌ర్నూలులో నిర్వ‌హించిన స‌భ పూర్తిగా అట్ట‌ర్ ఫ్లాప్ అయిపోయింది.

క‌ర్నూలులో నిర్వ‌హించిన స‌భ‌కు కొంద‌రు కీల‌క నాయ‌కుడు డుమ్మా కొట్టారు. పైగా ముక్కు మొహం తెలియ‌ని ఒక ఎంపీని తీసుకువ‌చ్చి.. ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేయించారు. అయిన‌ప్ప‌టికీ.. ఆశించిన విదంగా మీడియా క‌వ‌రేజీ రాలేదు. వ‌చ్చిన ఎంపీ ఎవ‌రో కూడా ఏపీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు. పైగా సోముకుమీడియాకు మ‌ధ్య ఒక‌విధ‌మైన వార్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న పిలిచినా కొన్ని మీడియా సంస్థ‌లు ఈ మీటింగుకు హాజ‌రుకాలేదు. దీంతో క‌ర్నూలు స‌భ‌లో ఏం చ‌ర్చించారో.. ఏం తీర్మానం చేశారో కూడా ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేదు. దీంతో క‌ర్నూలు స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని.. బీజేపీ నేత‌ల్లోనే చ‌ర్చ సాగుతోంది.

అంతేకాదు.. నెల‌కో స‌భ అంటే.. ఏం చ‌ర్చిస్తాం?  ఏం తీర్మానం చేస్తాం..? అనే చ‌ర్చ కూడా పార్టీ నేత‌ల మ‌ధ్య ఉంది. ఎప్పుడైనా ఆరు మాసాల‌కు ఒక‌సారి స‌భ నిర్వ‌హించి.. నెల‌కో జిల్లాపై దృష్టి పెట్టాల‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.కానీ సోము మాత్రం నెల కో స‌భ నిర్వ‌హించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో స‌భ పెట్టినా.. జ‌నాల‌ను తీసుకువ‌చ్చేందుకు నాయ‌కులు ఆస‌క్తి చూపించ‌డం లేదు. పైగా ఖ‌ర్చుల‌కు కూడా వెనుకాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇది కాదు.. పార్టీ పుంజుకోవాలంటే.. వార్డుస్థాయిలో పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని వారు చెబుతున్నారు. కానీ.. సోము ఒక‌రి మాట వినే టైపు కాదని.. త‌ను అనుకున్న‌ట్టే జ‌ర‌గాల‌ని ఆదేశిస్తున్నార‌ని అంటున్నారు. దీంతో అనుకున్న విధంగా మైలేజీ రాక‌పోవ‌డంతో ఇబ్బందులు ఏర్ప‌డుతున్నాయి.
Tags:    

Similar News