కార్యకర్తను కొట్టిన టీఆర్ఎస్ కు ఎమ్మెల్యేకు చేదు అనుభవం!
ఎంత ఎమ్మెల్యే అయితేనేమీ.. ఈరోజు చేయిచేసుకోవడం ఏంటి? సొంత పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న గులాబీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైందన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.. గ్రామస్థులు ఆయనను గట్టిగా నిలదీయడంతో క్షమాపణ చెప్పక తప్పలేదట. ఈ ఉదంతం దుబ్బాకలో చోటుచేసుకుందని వార్తలు వస్తున్నాయి.
దుబ్బాకలో త్వరలో ఉప ఎన్నిక జరుగబోతుండడం గులాబీ పార్టీ నేతలంతా ఆ నియోజకవర్గంపై వాలిపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దుబ్బాకలో ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా దుబ్బాక నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. గ్రామస్థులంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఘెరావ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం వెంకట్రావుపేట లో ఆదివారం టీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్.. మండల అధ్యక్షుడు సిలివేరి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశం జరుగుతుండగా కనకరాజ్ అనే వ్యక్తి తనకు టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఇవ్వక పోవడం పై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను, మల్లారెడ్డి ని నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగగా ఎమ్మెల్యే అతడి పై చేయి చేసుకున్నట్లు సమాచారం.
సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే తన గ్రామానికి చెందిన వ్యక్తిపై చేయి చేసుకోవడం తో గ్రామస్థులంతా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘మా ఊరికొచ్చి మా పిల్లలపై చేయి చేసుకుంటావా?’ అంటూ ఎమ్మెల్యేను ఘెరావ్ చేశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో ఎమ్మల్యే క్రాంతి కుమార్ గ్రామస్థులకు క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ విషయంపై ఎమ్మెల్యే క్రాంతికుమార్ స్పందిస్తూ తాను ఎవరిపై చేయిచేసుకోలేదని స్పష్టం చేశారు. కనకరాజు అనే వ్యక్తి సమావేశంలో తనకు సభ్యత్వం ఇవ్వలేదని గొడవకు దిగగా అతడి భుజంపై చేయివేసి సముదాయించానని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇప్పటికే దుబ్బాకలో టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఈ సంఘటన నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.