బిట్ కాయిన్ ఒక క్లాసిక్ బుడ‌గ‌ : రఘురామ్ రాజన్

Update: 2021-01-15 04:58 GMT
బిట్‌ కాయిన్... ఏడాదిగా వార్తల్లో ఉన్న క్రిప్టోకరెన్సీ ఇది. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో బిట్‌ కాయిన్  గురించి కాస్త ఎక్కువగానే పెద్ద చర్చ జరుగుతుంది. అయితే బిట్‌ కాయిన్‌ కు ఎప్పుడైనా బ్యాడ్ డేస్ కూడా ఉంటాయని కొందరు ముందే ఊహించారు. బిట్ కాయిన్ ధర భారీగా పెరుగుతుండటంతో అంతా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, బిట్ కాయిన్‌కు విలువ కట్టలేరు. ఎందుకంటే అది విలువను ఉత్పత్తి చేసే ఆస్తి కాదు. బిట్ కాయిన్ ...ఓ వ‌ర్చువ‌ల్ మ‌నీ. బిట్ కాయిన్ ఒక క్లాసిక్ బ‌బుల్ అని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ తేల్చేశారు. ప్ర‌ముఖ విద్యుత్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ అసాధార‌ణ రీతిలో పెరిగిపోవ‌డానికి ఇదే కార‌ణం అని చెప్పారు.

2008 ఆర్థిక మాంద్యం ప్ర‌భావాన్ని ముందే ప‌సిగ‌ట్టిన ఆర్థిక వేత్త ర‌ఘురామ్ రాజ‌న్‌. ఒక‌వేళ ప్ర‌పంచం మ‌రో సంక్షోభంలో చిక్కుకుంటే బిట్ కాయిన్‌, టెస్లా విలువ బుడ‌గ మాదిరిగా దూసుకెళ్తాయ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. బుడ‌గ వంటి మార్కెట్ల ధోర‌ణి, ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి విధానం స‌ర‌ళ‌త‌రం, త‌క్కువ వ‌డ్డీరేట్లు ఇవ‌న్నీ బిట్ కాయిన్ విలువ పెరుగ‌డానికి కార‌‌ణం అన్నారు. గ‌తేడాది 10 వేల డాల‌ర్లున్న బిట్ కాయిన్ విలువ ఈనాడు 40 వేల డాల‌ర్లు దాటింద‌ని ర‌ఘురామ్ రాజ‌న్ గుర్తు చేశారు. బిట్ కాయిన్ ఒక క్లాసిక్ బబుల్ అని, దీనికి నిజ‌మైన విలువ లేద‌న్నారు. ఇది ఒక ఆస్తిగా ప‌రిగ‌ణించినా చెల్లింపులు చేయడం కొంచెం క‌ష్ట సాధ్యం అని చెప్పారు. 40 వేల డాల‌ర్లు దాటిన బిట్ కాయిన్ కొనుగోలు చేయ‌డానికి ఇప్ప‌టికీ ఇన్వెస్ట‌ర్లు ఆస‌క్తి చూపుతున్నార‌ని, కానీ అది బుడ‌గ‌వంటిద‌ని గుర్తు చేశారు.

శ‌ర‌వేగంగా స్టాక్‌ మార్కెట్లు దూసుకెళ్ల‌డంపైనా ర‌ఘురామ్ రాజ‌న్ స్పందించారు. స్టాక్ మార్కెట్లు కీల‌క‌మైన 50 వేల మార్కును దాటి పోవ‌చ్చున‌ని చెప్పారు. దీనికి ఐటీ దిగ్గ‌జ సంస్థ ఇన్ఫోసిస్‌, విప్రో ఆర్థిక ఫ‌లితాలే కార‌ణం అని తెలిపారు. స్టాక్ మార్కెట్ల మాయ‌లో ప‌డొద్ద‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. క‌రోనా మ‌హ‌మ్మారి వేళ‌ కొన్ని పెద్ద కంపెనీలు మాత్ర‌మే లాభ ప‌డ్డాయని, కానీ చిన్న ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయ‌ని, అసంఘ‌టిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయార‌ని ప్ర‌భుత్వానికి గుర్తు చేశారు.  ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల వారు మాత్ర‌మే కార్లు కొనుగోలు చేస్తార‌ని ర‌ఘురామ్ రాజ‌న్ చెప్పారు.  


బిట్‌ కాయిన్ ధర చరిత్ర చూస్తే …
2019లో బిట్ కాయిన్ ధర 7,000 డాలర్లు
2020 సెప్టెంబర్ లో బిట్‌కాయిన్ ధర 10,000 డాలర్లు
2020 అక్టోబర్ లో బిట్ కాయిన్ ధర 13,000 డాలర్లు
2020 నవంబర్ లో 17,000 డాలర్లు
2020 డిసెంబర్ 26 నాటికి 25,000 డాలర్లు... బిట్ కాయిన్ ర్యాలీ ఎక్కడ ఆగుతుందో అంచనా వేయడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది.  చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా  బిట్ కాయిన్ ర్యాలీ కొనసాగుతుంది. రోజురోజుకు ధర రాకెట్‌లా దూసుకెళ్తుంది.  12 ఏళ్ల కిందట మొదలైన ఈ బిట్ కాయిన్ తన ధరను పెంచుకుంటూ పోతుంది కానీ , ఈ బిట్ కాయిన్ ఎదో ఒకరోజు ముంచేస్తుంది.

 ఇక ఈ బిట్ కాయిన్ ను నమ్మితే ఎలా ఉంటుందో చెప్పే ఓ చక్కటి ఉదాహరణ గత రెండు రోజుల క్రితం జరిగింది. ఒక చిన్న పాస్‌‌ వర్డ్ మర్చిపోయి  220 మిలియన్ డాలర్లు పోగొట్టుకున్నాడు. జర్మనీకి చెందిన ఓ  వ్యక్తి పేరు స్టీఫెన్ థామస్. ప్రోగ్రామర్ అయిన స్టీఫెన్.. ప్రస్తుతం శాన్‌‌ ఫ్రాన్సిస్కో లో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా ఇతడు సంపాదించిన డబ్బులతో బిట్‌‌ కాయిన్స్‌‌ లో ఇన్వెస్ట్ చేశాడు. వీటి విలువ దాదాపు 220 మిలియన్ డాలర్లు ( ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1,610 కోట్లకు పైమాటే).

రీసెంట్‌‌గా బిట్‌కాయిన్ విలువ 50 శాతం పడిపోయింది. దీంతో తన డబ్బులను తిరిగి తీసుకుందామని స్టీవెన్ యత్నించాడు. అయితే అందుకు తన అకౌంట్‌ లో ఐరన్‌‌ కీ అనే హార్డ్‌ డ్రైవ్ లో  అన్ ‌‌లాక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అన్ ‌లాక్ చేస్తే వచ్చే ప్రైవేట్ కీ ద్వారా డిజిటల్ వ్యాలెట్ ‌‌ను ఆయన యాక్సెస్ చేసుకోవచ్చు. తద్వారా అందులో ఉన్న 7,002 బిట్ కాయిన్స్ అతడి సొంతమవుతాయి. అయితే స్టీఫెన్ పాస్ ‌‌‌వర్డ్‌‌‌‌ మర్చిపోవడంతో ఐరన్‌ కీ అన్ ‌లాక్ కాలేదు. కొన్నిసార్లు ప్రయత్నించినా అన్‌‌ లాక్ కాలేదు. ఐరన్ ‌‌కీ ని అన్‌‌ లాక్ చేయడానికి ఆయనకు రెండు చాన్సులే ఉన్నాయి. అందులో స్టీఫెన్ విఫలమైతే ఆయన అకౌంట్ సీజ్ అవుతుంది. కొన్నేళ్ల క్రితం తన ఐరన్ ‌కీ పాస్‌‌ వర్డ్ ‌‌ను ఓ లెటర్ ‌‌లో స్టీఫెన్ రాశాడు. అయితే ఇప్పుడా లెటర్ కనిపించకుండా పోయిందట. ‘నేను బెడ్ మీద పడుకొని పాస్ ‌వర్డ్ గురించే ఆలోచిస్తున్నా. ఏదోటి గుర్తుకురాగానే కంప్యూటర్ దగ్గరకు వెళ్లి ప్రయత్నిస్తున్నా. కానీ వర్కౌట్ అవ్వట్లేదు. నేను చాలా నిరాశలో ఉన్నా’ అని పాస్ ‌‌వర్డ్ మర్చిపోవడం గురించి స్టీఫెన్ చెప్పుకొచ్చాడు.‌‌ బిట్‌కాయిన్ అనేది క్రిప్టోక‌రెన్సీ చ‌ట్టాల ప్ర‌కారం న‌డుస్తుంది. అంటే ప్ర‌తి ఒక్క బిట్‌కాయిన్‌కు ఒక క్రిప్టోగ్రాఫిక్ కీ ఉంటుంది. ఇది స‌ద‌రు బిట్‌కాయిన్ ఓన‌ర్‌కు మాత్ర‌మే తెలుస్తుంది. దీనిని మేనేజ్ చేయ‌డానికి సంస్థ‌లు కానీ, ఓ కేంద్రీకృత కార్యాల‌యం కానీ మాస్ట‌ర్ కీ కానీ ఏదీ ఉండ‌దు. ఈ కీని ఆ వ్య‌క్తే మ‌రొక‌రికి చెబితే త‌ప్ప ఎవ‌రికీ తెలియ‌దు. అంటే ఆ క్రిప్టో వాలెట్ పాస్‌వ‌ర్డ్‌ మ‌ర‌చిపోయారంటే దానిని ఇక ఎవ‌రూ ఓపెన్ చేయ‌లేరు.
Tags:    

Similar News