కేంద్రం అలెర్ట్: దేశంలో రోజురోజుకీ వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ

Update: 2021-01-13 23:30 GMT
దేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూపై కేంద్రప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

ఏవియన్ ఫ్లూయెంజా నమూనాల పరీక్షలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అత్యవసరమైన పరిస్థితులలో పక్షుల కల్లింగ్ కు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం సూచించింది. దేశంలో ఇప్పటివరకు పది రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో బర్ద్ ఫ్లూ వ్యాపించింది.

ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరఖండ్ లల్లో ఇప్పటివరకు ఈ వైరస్ జాడలు కనిపించాయి. తాజాగా ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ లో పలు చోట్ల పక్షులు మృతి చెందడం కలకలం రేపాయి. ఉత్తరఖండ్ లో అయితే కొన్నిరోజులుగా దాదాపు 300 పక్షులు మృత్యువాతపడ్డాయి. రాజస్థాన్ లో చనిపోయిన కాకులల్లో పరీక్షించగా హెచ్5ఎన్8 వైరస్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

ప్రజల్లో భయాందోళనల నేపథ్యంలో కేంద్రం అలెర్ట్ అయ్యింది. బర్డ్ ఫ్లూ పర్యవేక్షణకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశాయి. బాందా జిల్లాలోకి బయటి ప్రాంతాల నుంచి గుడ్లు, కోళ్లు రాకుండా సరిహద్దు పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశామని ఏఎస్పీ మహేంద్ర ప్రతాప్ చౌహాన్ తెలిపారు.


Tags:    

Similar News