వాదనలకు సమయం కాదు.. వర్క్ ఫ్రమ్ హోమ్ సూపర్ సక్సెస్ : బిల్ గేట్స్ !
కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఈ సంస్కృతి బాగా పని చేస్తోందని, వైరస్ ముగిసిన తర్వాత కూడా చాలా కంపెనీలు దీనిని కొనసాగిస్తాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ చెప్పారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాల్సి వచ్చిందని, కానీ ఇది బాగా వర్క్ అయింది అని, కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ఐటీ సంస్థలు సహా వివిధ రంగాల్లో వెసులుబాటు ఉన్న అన్ని సంస్థలు ఇంటి నుండి పనిని ఇచ్చాయి. టీసీఎస్ వంటి కంపెనీలు రానున్న అయిదేళ్లలో 75 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేలా చూస్తామని ఇప్పటికే ప్రకటించింది.
'వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగా వర్క్ అవుతోందని, కరోనా మహమ్మారి నుండి బయటపడిన తరువాత కూడా దీనిని కొనసాగిస్తారు' అని భావిస్తున్నానని బిల్ గేట్స్ ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన ఆన్ లైన్ బిజినెస్ సమ్మిట్ లో చెప్పారు. అయితే ఈ మహమ్మారి ముగిసిన అనంతరం కార్యాలయాలలో ఎంత శాతం మంది ఉండాలనే అంశంపై ఆలోచించాలని , ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు. చాలా కంపెనీలు 50 శాతం కంటే తక్కువ మంది ఉద్యోగులు కార్యాలయాలకు రప్పించే విషయం పై చర్చిస్తున్నాయని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా బాగుంది అని, కరోనా అంతం తర్వాత ఆఫీసులకు ఎంత శాతం సమయాన్ని వెచ్చించాలనే దానిపై పునరాలోచన చేయాలన్నారు. అయితే, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు, ఇళ్లు చిన్నగా ఉన్నప్పుడు, ఇలా వివిధ ఇబ్బందులు ఉంటాయని తెలిపారు. ఆ సమయంలో పని చేయడం కష్టంగా మారుతుందన్నారు. మహిళల విషయంలో మరిన్ని ఇబ్బందులు ఉంటాయని అన్నారు.
ఇక కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతూ .. కరోనా వైరస్ అంశాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో చైనా విఫలమైందని వాదనలకు ఇది సమయం కాదని, అది సమయం వృథా చేయడమే అన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ లాక్ డౌన్ విధించిందని, ఆ సమయంలో డిజిటల్ మార్గంలో మనీ ట్రాన్సుఫర్, రేషన్ వంటి అద్బుతమైన పనులు చేసిందని కితాబిచ్చారు. అలాగే ఈ ఏడాది నేను ఒక్క రోజు కూడా పని కోసం ఆఫీస్ కి వెళ్లలేదని తెలిపారు.