చెల్లి చావుకు కారణమైన వ్యక్తి తీహార్ జైలులో దారుణ హత్య
దేశంలోనే ప్రముఖులు ఉండే జైలుగా గుర్తింపు పొందిన తీహార్ జైలులో ఓ నిందితుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన చెల్లెలిని అత్యాచారం చేసిన వాడ్ని ఆమె సోదరుడు వెంటాడి వేటాడి హతమార్చాడు. ఈ ఘటన సంచలనంగా మారింది.
ఢిల్లీలోని అంబేడ్కర్ నగర్ కి చెందిన జాకీర్ (21)కి చెల్లెలు ఉంది. ఆమె ఇంకా మచనరే. 2014లో ఆమెపై ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్ (27) అత్యాచారం చేశాడు. అత్యాచారానికి గురైన అనంతరం ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు మెహతాబ్ కి శిక్ష పడేలా చేశారు. దర్యాప్తు అనంతరం మొహతాబ్ ను తీహార్ జైలుకు తరలించారు.
అయితే తన అత్యాచారంంతో పాటు తన చెల్లెలి మరణానికి కారణమైన మెహతాబ్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు. రేప్ చేసినందుకు, ఆమె మరణానికి కారణమైన మెహతాబ్ పై పగ పెంచుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మెహతాబ్ ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. దానికి ప్రణాళిక రచించి మెహతాబ్ హత్యకు అమలు చేశాడు. జైలులో అతడిని చంపాలని డిసైడయ్యాడు. ఈ క్రమంలో జైలుకు వెళ్లేందుకు జాకీర్ ఓ నేరం చేశాడు. హత్యా నేరం రుజువుకావడంతో 2018లో జాకీర్ తీహార్ జైలుకు వెళ్లాడు. తీహార్ జైలులో తాను ఉంటున్న వార్డు, మెహతాబ్ ఉంటున్న వార్డు వేరు. మెహతాబ్ ను చంపేందుకు జైలులోనే మరో ప్లాన్ వేశాడు.
అందులో భాగంగా తన వార్డులో ఉంటున్న ఖైదీలతో గొడవ పెట్టుకుని వాళ్లపై దాడి చేశాడు. దీంతో జైలు అధికారులు అతడిని వార్డు మార్చి మెహతాబ్ ఉండే వార్డులో వేశారు. ఆయన ప్లాన్ వర్కవుట్ అయ్యింది. దీంతో మెహతాబ్ హత్యకు అవకాశం దొరికింది. దీంతో జాకీర్ జూన్ 27 ఉదయం ఖైదీలందరూ ప్రార్థన కోసం బయటకు వచ్చినప్పుడు మెహతాబ్ హత్య చేయాలని డిసైడయ్యాడు. మెహతాబ్ బయటకు రాగానే కత్తిలాంటి పదునైన ఆయుధంతో జాకీర్ దాడి చేశాడు.
మెహతాబ్ శరీరంపై పలుచోట్ల దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని జైలు అధికారులు వెంటనే అతడిని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మెహతాబ్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ విధంగా తన చెల్లి చావుకు కారణమైన అతడిపై అన్న జైలులోనే పగ తీర్చుకున్నాడు. ఈ క్రమంలో జాకీర్ పై హరినగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.