బిహార్: కొత్త ఎమ్మెల్యేల్లో 68 శాతం మందిపై క్రిమినల్ కేసులు , 198 మంది కోటీశ్వరులు

Update: 2020-11-12 07:30 GMT
తాజాగా బీహార్ ఎన్నికలు ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ ప్రభుత్వమే మళ్లీ అధికారం చేప్పట్టబోతోంది.  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో సుమారు మూడింట రెండొంతుల మందిపై క్రిమినల్‌ కేసులున్నట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా  ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 241 మంది సమర్పించిన అఫిడ్‌ విట్‌ లను ఏడీఆర్‌ విశ్లేషించింది. ఎన్నికైన 243 మంది ఎమ్మెల్యేల్లో 194 మంది కోటీశ్వరులున్నట్టు తేలింది. వీరి సగటు ఆస్తి రూ.4.32 కోట్లుగా వివరించింది.

ఇందులో బీజేపీ 65, ఆర్జేడీ 64, జేడియు 43, కాంగ్రెస్ 14 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు సగటున కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్టు ఏడీఆర్ డేటా తెలియజేసింది. 2015 ఎన్నికల్లో 162 మంది కోటీశ్వరులు ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేల సగటు ఆస్తి 2015లో రూ.3.15 కోట్లు ఉండగా.. ఈ సారి ఇది రూ.5.26 కోట్లుగా ఉంది. ఇక , 68 శాతం , అంటే 163 మంది) మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి. క్రిమినల్ కేసులు కలిగిన 163 మందిలో 123 మందిపై హత్య, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి.  . గత ఎన్నికల్లో విజయం సాధించిన 142 మంది పై క్రిమినల్ కేసులున్నట్టు ఏడీఆర్ పేర్కొంది. తాజా ఎన్నికల్లో గెలిచిన 31 మంది తమపై హత్య కేసులున్నట్టు, ఎనిమిది మంది మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.

పార్టీల పరంగా చూస్తే ఆర్జేడీ ఎమ్మెల్యేల్లో 54 మంది , బీజేపీ 47 మంది , జేడీయూ 20 మంది , కాంగ్రెస్ 16 మంది , సీపీఐ(ఎంఎల్‌)(ఎల్‌)లో 10 మంది  , ఎంఐఎం ఐదుగురి  పై క్రిమినల్‌ కేసులున్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది.  25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్నవారు 115 మంది.. 51-80 ఏళ్ల మధ్య వయస్కులు 126 మంది ఎన్నికయ్యారు. మహిళ విషయానికి వస్తే కేవలం 11 శాతం మంది మాత్రమే విజయం సాధించారు. గత ఎన్నికల్లో 28 మంది మహిళా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు.
Tags:    

Similar News